E-Paper
Advertisement

Rajasekhar’s Role: శర్వానంద్ ‘బైకర్‌’ లో రాజశేఖర్ పాత్ర ఇదే.. ఒపీనియనే కదా మారుద్దాం!

Rajasekhar’s Role: శర్వానంద్ ‘బైకర్‌’ లో రాజశేఖర్ పాత్ర ఇదే.. ఒపీనియనే కదా మారుద్దాం!
Advertisement

Rajasekhar’s Role: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘బైకర్’. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. బైకర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్ర పేరు ‘బుల్లెట్ సునీల్’. ఈ పేరు వినడానికి విభిన్నంగా ఉండటమే కాకుండా, రాజశేఖర్ లుక్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. రఫ్ అండ్ టఫ్ మేకోవర్‌తో, వింటేజ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై రాజశేఖర్ కనిపిస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇది కేవలం అతిథి పాత్ర మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్ర అని సమాచారం. శర్వానంద్ లాంటి డైనమిక్ యాక్టర్ పక్కన రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో తోడవ్వడం సినిమాపై అంచనాలను పెంచింది.

Read also-Varanasi Update: రాజమౌళి ప్రియాంకకు ఇచ్చిన మాట ఇదే.. అలా కాకపోతే సినిమా రిలీజ్ కాదు..

Advertisement

అభిరామ్ దొగ్గిరాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పక్కా స్పోర్ట్స్ డ్రామాగా, ముఖ్యంగా బైక్ రేసింగ్ చుట్టూ తిరుగుతుంది. స్పోర్ట్స్ డ్రామా లో రాబోతున్న ఈ చిత్రానికి ఘంటసాల భరణి సంగీతాన్ని అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. చాల కాలం తర్వాత రాజశేఖర్ ఒక వైవిధ్యమైన, మాస్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తుండటంతో, ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడదల కావాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్ 12న విడుదలకు సిద్ధం అవగా బాలయ్య బాబు ‘అఖండ 2’ విడుదల సందర్భంగా వాయిదా పడింది. ‘నారీ నారీ నడుమ మురారీ’ అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన శర్వానంద్ ఆ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో అదే జోష్ కొనసాగిద్దాం అనుకుంటున్నాడు శర్వానంద్.

Read also-Varanasi Movie: ‘వారణాసి’లో రాముడి పాత్ర కోసం మహేశ్ బాబు మూడు నెలలు ఏం చేశారో తెలుసా..

Advertisement

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×