E-Paper
Advertisement

Hyderabad Crime: ఆ ఫోటోలు ఎంత పని చేశాయి.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఏం చేశాడంటే

Hyderabad Crime: ఆ ఫోటోలు ఎంత పని చేశాయి.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఏం చేశాడంటే
Advertisement

Hyderabad Crime: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కొత్త కొత్త క్రైమ్స్ వెలుగులోకి వస్తున్నాయి. రామ్‌గోపాల్ వర్మ చెప్పినట్టు క్రైమ్ అదే.. కాకపోతే దాని రూపం మారుతూ ఉంటుంది.  మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు దిగారు కొందరు వ్యక్తులు. దీంతో షాకైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం రేపిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

హైదరాబాద్‌లో దారుణం.. మార్పింగ్ ఫోటోలు పంపి

Advertisement

స్మార్ట్ ఫోన్ మనుషులను చంపేస్తోందా? రానున్న రోజుల్లో ఈ తరహా ఘటనలు జోరందుకోనున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. కేవలం సమాచారం కోసం ఉపయోగించాల్సిన ఫోన్లను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ రాంనగర్ యువకుడి ఘటన.

రాంనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు ప్రేమ్‌కుమార్. అతడి వయస్సు 36 ఏళ్లు. ఇటీవల అతడి ఫోన్ సైబర్ నేరగాళ్ల వలలో పడింది. ప్రేమ్‌కుమార్‌కు మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు పంపించారు. తమకు మూడు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కుటుంబ సభ్యులకు ఆయా ఫోటోలను పంపిస్తామని బెదిరించారు. అంతేకాదు వీటిని వీడియోలుగా చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

Advertisement

సైబర్ వేధింపుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య

ఆ బెదిరింపులతో భయపడ్డాడు ప్రేమ్‌కుమార్. ఉన్నట్లుండి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇలాంటి ఫోటోలు రావడంతో ఖంగుతిన్నాడు. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. చివరకు ఈ విషయం అతడి భార్య, కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనకు ధైర్యం చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఐనప్పటికీ సైబర్ నేరగాళ్ల నుంచి నిరంతర బెదిరింపులు ప్రేమ్ కుమార్‌కు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ ప్రేమ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఫ్యామిలీ సభ్యులు షాకైయ్యారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనతో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

ALSO READ: కొరియన్ గేమ్ టాస్క్.. 9వ ఫ్లోర్ నుంచి దూకి.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు దుర్మరణం

డిజిటల్ యుగంలో ఆ తరహా బెదిరింపులు వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సైబర్ నిపుణులు సూచన చేస్తున్నారు. ఈ తరహా ఘటనలకు బలైందని కేవలం ప్రేమకుమార్ మాత్రమే, ఇలాంటి దేశంలో పదేపదే జరుగుతున్నాయి. చాలామంది బయటకు చెప్పుకోలేక ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. స్మార్ట్ మొబైల్ విషయంలో యువత జాగ్రత్త.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×