E-Paper
Advertisement

Goa IRCTC Tour Package: IRCTC గోవా టూర్ ప్యాకేజీ.. 4 రోజులు ఎంజాయ్ చేసేందుకు రెడీనా?

Goa IRCTC Tour Package: IRCTC గోవా టూర్ ప్యాకేజీ.. 4 రోజులు ఎంజాయ్ చేసేందుకు రెడీనా?
Advertisement

IRCTC VIBRANT GOA Tour Package: గోవా అందాలు, సహజ సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందమైన సముద్ర తీరాలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు, పోర్చుగీస్ శైలి నిర్మాణాలు, చక్కటి ఆలయాలతో  గోవా అందంగా ఆకట్టుకుంటుంది. బాగా బీచ్, దూద్‌ సాగర్ జలపాతం, మోర్జిమ్ బీచ్, బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, కలాంగూట్ బీచ్ వంటివి పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. ఈ అందాలను తిలకించాలనుకునే వారికి IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. ఇయర్ ఎండ్, క్రిస్మస్ వేడుకలను గోవాలో చీర్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ఈ టూర్ ను ప్లాన్ చేసింది. IRCTC VIBRANT GOA అనే పేరుతో ఈ యాత్రను టూరిస్టుల ముందుకు తీసుకొచ్చింది.

ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే?

IRCTC VIBRANT GOA టూర్ ప్యాకేజీ 3 రాత్రులు, 4 పగళ్ల పాటు కొనసాగనుంది. డిసెంబర్ 25, 2025 రోజున ఉదయం 10:50 గంటలకు ఢిల్లీ నుంచి విమాన నంబర్ AI 2627 ద్వారా ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు గోవా చేరుకుంటుంది. ఆ తర్వాత, హోటల్‌ కు తీసుకెళ్తారు. అక్కడ చెక్ ఇన్ చేసుకోవాలి. రోజంతా విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తారు.  ఆ తర్వాత రోజు నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. అగ్వాడా కోట, కలాంగూట్ బీచ్, బాగా బీచ్, అంజునా బీచ్,  చపోరా కోటతో సహా ఉత్తర గోవా అంతటా తిప్పుతారు. మరుసటి రోజు దక్షిణ గోవాలోని ప్రశాంతమైన, అందమైన టూరిస్ట్ స్పాట్ లను సందర్శించే అవకాశం కల్పిస్తారు. ముందుగా, మిరామార్ బీచ్‌ కు తీసుకెళ్తారు. ఆ తర్వాత మాండోవి, జువారీ నదులు అరేబియా సముద్రంలో కలిసే రొమాంటిక్ డోనా పౌలా వ్యూపాయింట్‌ కు తీసుకెళ్తారు. ఈ టూర్ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనం IRCTC అధికారులు అందిస్తారు. ప్యాకేజీలో భాగంగా విలాసవంతమైన హోటల్‌లో వసతి అందించబడుతుంది.

IRCTC VIBRANT GOA టూర్ ప్యాకేజీ ఛార్జ్ ఎంతంటే?

Advertisement

⦿  సింగిల్ షేర్ యాత్రికుడికి రూ. 52,720

⦿ డబుల్ షేర్ యాత్రికుడికి రూ. 39,260

Advertisement

⦿ ట్రిపుల్ షేర్ యాత్రికుడికి రూ.36,700గా IRCTC అధికారులు నిర్ణయించారు.

గోవాలో చూడాల్సిన అందాలు

⦿ సముద్ర తీరాలు: గోవాకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన  అందమైన బీచ్‌లు ఉన్నాయి, వీటిలో బాగా బీచ్, మోర్జిమ్ బీచ్ ముఖ్యమైనవి. పాలెం బీచ్ ప్రశాంతమైన  విశ్రాంతి తీసుకోవడానికి అనువైనవి.

⦿ చారిత్రక కట్టడాలు: బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ లాంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, గోవా పోర్చుగీస్ వారసత్వాన్ని గుర్తు చేస్తాయి. పురాతన దేవాలయాలు కూడా ఆకట్టుకుంటాయి.

⦿ ప్రకృతి సౌందర్యం: పశ్చిమ కనుమల శ్రేణిలో ఉండటం వల్ల గోవాలో జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. దూద్‌సాగర్ లాంటి అందమైన జలపాతాలను చూడవచ్చు.

⦿ సంస్కృతి గొప్పదనం: ఇక్కడ పర్యాటకులకు పోర్చుగీస్, భారతీయ సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం గోవాను పర్యాటకానికి అనువైన ప్రదేశంగా మార్చింది.

ఇక IRCTC VIBRANT GOA కోసం IRCTC వెబ్‌ సైట్,  మొబైల్ యాప్ ద్వారా ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ నంబర్ల(9717641764, 9717648888)ను సంప్రదించవచ్చని రైల్వే అధికారులు సూచించారు.

Read Also:  సబ్ వేలోకి వెళ్లగానే సడెన్ ఆగిపోయిన మెట్రో రైలు, ఇంతకీ ఏం జరిగిందంటే?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×