E-Paper
Advertisement

ఇలా చేస్తే.. తక్కువ బడ్జెట్‌లో.. సింపుల్‌గా సింగపూర్ చుట్టేయొచ్చు!

ఇలా చేస్తే.. తక్కువ బడ్జెట్‌లో.. సింపుల్‌గా సింగపూర్ చుట్టేయొచ్చు!
Advertisement

Singapore Travel: మొన్నటి వరకు తుమ్మినా.. దగ్గినా.. దుబాయ్‌‌లో తేలినవారు.. ఇప్పుడు సింగపూర్‌ వైపు చూస్తున్నారు. యుద్ధంతో సంబంధం లేకుండా ప్రస్తుతం సురక్షితంగా ఉన్న దేశాల్లో ఒకటి సింగపూర్. అయితే, ఈ దేశం కేవలం సంపన్నులకే అని అనుకుంటారు.  కానీ, అటు సాధారణ ప్రజలు సైతం వెళ్లి చూసి వచ్చేయొచ్చు. మరి బడ్జెట్ పేలిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారా? సింపుల్‌గా ఇలా చేస్తే.. తక్కువ ఖర్చులోనే సింగపూర్‌కు చెక్కేయొచ్చు.

సరైన ప్లానింగ్ ఉంటే.. మన దేశంలో ఒక టూర్ వేసినంత బడ్జెట్‌లోనే సింగపూర్‌ను చుట్టి రావచ్చు. దీనికి సంబంధించి ముందుగా మనం తెలుసుకోవాల్సింది వీసా గురించి. భారతీయులకు సింగపూర్ వీసా పొందడం చాలా సులభం. కానీ ఇది నేరుగా అప్లై చేయడానికి కుదరదు. కేవలం గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా వారం రోజుల్లోనే వీసా చేతికి వస్తుంది. కాబట్టి ప్రయాణానికి ఒక నెల ముందే ఈ ప్రాసెస్ మొదలుపెడితే ఎలాంటి టెన్షన్ ఉండదు.

Advertisement

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ హోటల్స్

ఇక ప్రయాణ ఖర్చుల విషయానికి వస్తే.. ఫ్లైట్ టికెట్లు మన బడ్జెట్‌ను అటు ఇటు చేయగలవు. అందుకే కనీసం రెండు మూడు నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకోవడం మంచిది. చెన్నై లేదా బెంగళూరు వంటి నగరాల నుంచి అయితే మనకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉంటాయి. సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటానికి ఖరీదైన హోటల్స్ జోలికి వెళ్లకుండా.. చైనా టౌన్ లేదా లిటిల్ ఇండియా వంటి ప్రాంతాల్లో ఉండే క్యాప్సూల్ హోటల్స్‌ను ఎంచుకోండి. ఇవి తక్కువ ధరలో దొరకడమే కాకుండా, చాలా నీట్‌గా, సురక్షితంగా ఉంటాయి. ఒక బ్యాక్‌ప్యాకర్‌గా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడానికి కూడా ఇవి మంచి వేదికలు.

Advertisement

తక్కువ ధరలో బెస్ట్ ఫుడ్!

సింగపూర్‌లో తిరగడం అనేది అన్నీటికంటే సులభమైన పని. అక్కడ రవాణా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. మెట్రో రైలు (MRT) తో మీరు ఏ మూలకైనా నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మీరు విమానాశ్రయంలోనే ఒక టూరిస్ట్ పాస్ తీసుకుంటే.. అపరిమితంగా బస్సులు, మెట్రోల్లో ప్రయాణించవచ్చు. దీనివల్ల టాక్సీల మీద పెట్టే వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే.. అక్కడ ఉండే ‘హాకర్ సెంటర్స్’ మన ఊరి ఫుడ్ కోర్టుల లాంటివి. ఇక్కడ లోకల్ ఫుడ్ నుండి ఇండియన్ ఫుడ్ వరకు అన్నీ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ముఖ్యంగా నాన్-వెజ్ ప్రియులకు ఇది ఒక స్వర్గం అనే చెప్పాలి.

ఈ 5 ప్రదేశాలు పూర్తిగా ఫ్రీ!

చాలామంది సింగపూర్ అంటే అన్నీ టికెట్లు పెట్టి చూడాలి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మెర్లయన్ పార్క్ దగ్గర ఫోటోలు దిగడం, గార్డెన్స్ బై ది బే లోని సూపర్ ట్రీ షో చూడటం, మరీనా బే సాండ్స్ దగ్గర జరిగే అద్భుతమైన లేజర్ షో.. ఇవన్నీ రూపాయి ఖర్చు లేకుండా మనం ఎంజాయ్ చేయవచ్చు. అలాగే సంతోసా ఐలాండ్‌లోని బీచ్‌ల్లో కూడా మనం ప్రశాంతంగా గడపవచ్చు. ఒక స్మార్ట్ ప్లానింగ్ ఉంటే, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే సింగపూర్ వీధుల్లో రాజాలా తిరిగేయవచ్చు.

Also Read: ఇవి విదేశీ బీచ్‌లు అనుకుంటే పొరపాటే.. వైజాగ్‌లోని బీచ్‌ల గురించి తెలుసా?

Related News

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

న్యూక్లియర్ రియాక్టర్ వేడితో హైడ్రోజన్ ఉత్పత్తి.. భారత టెక్నాలజీకి ప్రపంచం షాక్!

పాదరక్షలు లేకుండా 32 కి.మీ నడక.. సింహాచల గిరి ప్రదక్షిణ విశిష్టత ఇదే!

రోడ్లపై ఎండ.. భవనాలపై వర్షం.. చైనా కొత్త కూలింగ్ టెక్నిక్ కు ప్రపంచం ఫిదా!

Big Stories

Advertisement
×