Muralitharan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొడుతున్న సంగతి తెలిసిందే. పెద్ద బౌలర్ నుంచి మొదలుకొని గల్లీ బౌలర్ల వరకు అందరినీ చీల్చి చెండాడుతున్నాడు. ఏ ఒక్కరిని వదలడం లేదు వైభవ్. ఇప్పటికే బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హెజెల్ వుడ్ లాంటి బౌలర్ల పై విరుచుకుపడ్డ వైభవ్… తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కూడా ఇరగదీశాడు. ఇలాంటి నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన మెంటార్ ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బౌలింగ్ చేసిన కూడా వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టేవాడని ఈ వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ ఇచ్చి బతికిపోయా… లేదంటే తన బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కూడా కొట్టేవాడని షాకింగ్ కామెంట్స్ చేశారు ముత్తయ్య మురళీధరన్ ( Muttiah Muralitharan). దీంతో ముత్తయ్య మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో నిన్న సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Sunrisers Hyderabad) మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణయిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సెంచరీ తో ఇరగదీశాడు. 37 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. దాదాపు 300 స్ట్రైక్ రేట్ మైంటైన్ చేశాడు వైభవ్.
అయితే సెంచరీ చేసిన వైభవ్ సూర్య వంశీ గురించి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( ( Sunrisers Hyderabad) ) సంబంధించిన స్పిన్ కోచ్, మెంటార్ ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో వైభవ్ ( Vaibhav) లాంటి క్రికెటర్ను తాను ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. అత్యంత భయంకరంగా సిక్సర్లు అలాగే బౌండరీలు బాదుతున్నాడని పొగిడారు. ఇప్పుడు ఉన్న టాప్ మోస్ట్ బౌలర్ల అందరికి చుక్కలు చూపించాడని గుర్తు చేశారు. ఒకవేళ తాను రిటైర్మెంట్ ఇవ్వకపోతే… తన బౌలింగ్లో కూడా ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టేవాడని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ముత్తయ్య మురళీధర్ ( Muttiah Muralitharan). తాను రిటైర్మెంట్ ఇచ్చి మంచి పని అయింది.. లేకపోతే నన్ను కూడా చెడుగుడు ఆడేసేవాడు అంటూ వైభవ్ సూర్య వంశీని మెచ్చుకున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==