E-Paper
Advertisement

Raviteja : నా తుదిశ్వాస అక్కడే జరగాలి.. ఎమోషనల్ అయిన రవితేజ!

Raviteja : నా తుదిశ్వాస అక్కడే జరగాలి.. ఎమోషనల్ అయిన రవితేజ!
Advertisement

Raviteja: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవాలి అంటే కాస్తో కూస్తో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకోవడం అంటే చాలా కష్టం. ఏ కొంతమందికో మాత్రమే ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ వస్తుంది అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా చిరంజీవి స్ఫూర్తిగా ఇండస్ట్రీలోకి వచ్చే సక్సెస్ అందుకున్న వారిలో మాస్ హీరో రవితేజ కూడా ఒకరు.

సినీ నేపథ్యం లేకుండా సక్సెస్ కొట్టిన హీరో..

ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసోసియేట్ డైరెక్టర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలను అందుకున్నారు. ఇక రవితేజ నటనను మెచ్చి ఈయనకు హీరోగా అవకాశాలు ఇవ్వడంతో హీరోగా తనని తాను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ తన నటనతో రవితేజ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈయన త్వరలోనే మాస్ జాతర(Mass Jathara) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి.

రిటైర్మెంట్ కు చోటు లేదు…

Advertisement

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రవితేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సినిమాలకు రిటైర్మెంట్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ సినిమాలలో పనిచేసే వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదని తెలిపారు. ఇక నా విషయంలో రిటైర్మెంట్ అనే పదానికి చోటు లేదని తెలిపారు.

నా తుది శ్వాస వరకు సినిమాలే..

Advertisement

నేను నా చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని నా తుది శ్వాస సినిమా సెట్ లోనే జరగాలి అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమాలంటే ఎంతో అమితమైన ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ నేడు ఈ స్థాయిలో ఉన్నారంటే సినిమాల పట్ల తనకున్న ఫ్యాషన్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ ఇప్పుడు ఏకంగా తన పేరు మీదట సినిమా థియేటర్లు నిర్మించే స్థాయికి వెళ్లారు అంటే ఇదే నిజమైన సక్సెస్ అని చెప్పాలి. ఇక రవితేజ ఇప్పటికి వరుస సినిమాలతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన బాటలోనే తన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

Also Read: Bahubalu : ఏంటీ  బాహుబలి 1 కంటే 2 ముందు షూట్ చేశారా..ఫస్ట్ సీన్ అదేనా?

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×