Montha effect: మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, తదితర జిల్లాల్లో ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు భయానికి గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
⦿ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ రోజు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
⦿ ఈ జిల్లాల్లో దంచుడే..
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
⦿ రెడ్ అలర్ట్ జిల్లాలివే..
సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి..
⦿ ఆరెంజ్ అలర్ట్ జిల్లాలివే..
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట
⦿ ఎల్లో అలర్ట్ జిల్లాలవే..
కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్
⦿ భారీ వర్షాలు జాగ్రత్త..!
మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ALSO READ: Heavy Rains: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఆ నగరాల్లో భారీ వరదలు, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు