Bahubali : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సినీ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం బాహుబలి(Bahubali). రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఇటీవల కాలంలో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే అయితే రాజమౌళి మాత్రం బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట అక్టోబర్ 31వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం కూడా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా హీరో ప్రభాస్ రానాతో పాటు రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ముందు మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకొని తర్వాత రెండో భాగం షూటింగ్ ప్రారంభిస్తారు కానీ రాజమౌళి మాత్రం విభిన్నంగా బాహుబలి పార్ట్ 2 ముందు షూటింగ్ చేసి అనంతరం బాహుబలి 1 మొదలుపెట్టినట్లు తాజాగా ప్రభాస్ వెల్లడించారు.
బాహుబలి షూటింగ్ ప్రారంభమైన తరువాత మొదటిసారి పార్ట్ 2 కి సంబంధించిన సన్నివేశాలను మూడు రోజుల పాటు చిత్రీకరించారని తెలిపారు. ఇందులో భాగంగా మొదట తాను అనుష్కతో కలిసి మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సన్నివేశాలను చిత్రీకరించారని తెలిపారు. నాకు మొదటి మూడు రోజులు సినిమా షూటింగ్లోకి వెళ్లిన తర్వాత తల ఏమాత్రం పనిచేయదని చాలా టెన్షన్ గా ఉండేదని తెలిపారు. ఇక మూడో రోజు మాహిష్మతి సభలో తల నరికే సీన్ చేసేటప్పటికి నాలోకి బాహుబలి ఎంట్రీ ఇచ్చాడని పూర్తిగా పాత్రలోకి లీనమైపోయానని ప్రభాస్ తెలిపారు.
నేనే రాజు అని ఫిక్స్ అయిపోయా..
ఇలా మూడు రోజులపాటు మాహిష్మతి సామ్రాజ్యంలోకి అనుష్కతో వెళ్లడం అక్కడ నన్ను బహిష్కరించడం వంటి సన్నివేశాలను షూట్ చేశారు. ఆ తర్వాత పార్ట్ 1 మొదలుపెట్టినట్టు ప్రభాస్ తెలియజేశారు. ఇక రానా కూడా మాట్లాడుతూ నాకు ఈ రెండు సినిమాలను కలిపి కథగా చెప్పినప్పుడే ఈ కథ నాకు ఎక్కేసిందని నేనే రాజు, అది నా రాజ్యం అనే ఫీలింగ్ లో ఉండిపోయాను అంటూ రానా కూడా తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాహుబలి ది ఎపిక్ పట్ల కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. బాహుబలి మొదటి భాగం విడుదలై 10 సంవత్సరాలు అయిన నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Also Read: Prabhas: ఏంటి ప్రభాస్ చిన్నప్పుడు చదువుకోలేదా… 10 పెద్దదా? 7 పెద్దదా?