E-Paper
Advertisement

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?
Advertisement

Indiramma Houses: ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇల్లు మంజూరైందన్న ఆనందం ఉన్నా.. నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇసుక సరఫరా కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘మన ఊరు–మన ఇసుక’ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బుకింగ్‌లు చేసుకోలేని పరిస్థితి నెలకొన్నది. దాదాపు మూడు నెలలుగా ఇదే సమస్య కొనసాగుతున్నా పరిష్కారం మాత్రంఅధికారులు చూపడం లేదు. ఒకవైపు ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తిచేయాలనే తపన.. మరోవైపు ఇసుక కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు పెరుగుతున్న నిర్మాణ వ్యయం వెరసి పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భారంగా మారుతోంది.

ఆన్‌లైన్‌లో బుకింగ్‌ కాని పరిస్థితి..

దిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొందేందుకు లబ్ధిదారులు ‘మన ఊరు–మన ఇసుక’ వెబ్‌సైట్‌పై ఆధారపడుతున్నారు. రూ. 1800 చెల్లిస్తే ట్రాక్టర్ ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, బుకింగ్ ప్రక్రియ ముందుకు సాగడం లేదని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు. బుకింగ్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇసుక పొందే మార్గం కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇసుక బుకింగ్ ప్రక్రియ సజావుగా సాగకపోవడంతో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించలేకపోతున్నామని, ఇప్పటికే పనులు మొదలుపెట్టినవారు వాటిని కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.ఇసుక కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

మూడు నెలలుగా అదే సమస్య..

Advertisement

మన ఊరు–మన ఇసుక’ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు గత మూడు నెలలుగా కొనసాగుతున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంతకాలంగా సమస్య పరిష్కారం కాకపోవడం అధికారుల పనితీరుపై విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వ్యవస్థే అందుబాటులో లేకపోతే లబ్ధిదారులు ఎవరిని ఆశ్రయించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సమస్యను పరిష్కరించి బుకింగ్ ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అధికారులు మాత్రం తగిన చొరవ చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్‌లు నిలిచిపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇసుక సరఫరా ఎలా చేయాలి? అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై స్పష్టత లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. సమస్య పరిష్కారానికి నిర్దిష్ట గడువు లేకపోవడంతో లబ్ధిదారులు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Also read: కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా? ఈ BLDC ఫ్యాన్లు వాడితే బెస్ట్

కలెక్టర్లు, మైనింగ్ అధికారుల చొరవేది?

Advertisement

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాలంటే లబ్ధిదారులకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉండటం కీలకం. అయితే మూడు నెలలుగా బుకింగ్ సమస్య కొనసాగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవడం, పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం అధికారుల బాధ్యత. మైనింగ్ శాఖ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి ఇసుక సరఫరాలో ఏర్పడుతున్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉంది.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు మేలు జరగాలంటే కేవలం ఇళ్ల మంజూరుతోనే సరిపెట్టకుండా నిర్మాణానికి అవసరమైన వనరుల లభ్యతపైనా అధికారులు దృష్టి పెట్టాలి. ఇసుక బుకింగ్ సమస్యను పరిష్కరించడంలో జాప్యం జరిగితే ఇళ్ల నిర్మాణం మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, మైనింగ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి లబ్ధిదారులకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు చెప్పామంటున్న మండలాధికారులు

‘మన ఊరు–మన ఇసుక’ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మండల స్థాయి అధికారులు చెబుతున్నారు. సమస్య తమ పరిధిలో లేదని, ఉన్నతస్థాయిలో పరిష్కారం కావాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. అయితే సమస్యను పైస్థాయి అధికారులకు వివరించామని చెప్పడం వరకే పరిమితమైతే లబ్ధిదారులకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం లేదా సమస్య పరిష్కారంలో జాప్యం జరగడం వల్ల నష్టపోయేది మాత్రం ప్రభుత్వ పథకంపై ఆశలు పెట్టుకున్న పేద లబ్ధిదారులే.

ఇల్లు మంజూరైనా.. నిర్మాణం ఎలా?

ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న సంతోషం లబ్ధిదారుల్లో ఎంతోకాలం నిలవడం లేదు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక దొరక్కపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణ పనులు ఆలస్యమైతే ఇతర ముడిసరుకుల ధరలు, కూలీ ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో తమపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ పరిస్థితి మరింత భారంగా మారుతోంది.ఇంటి నిర్మాణం అనేది ఒక్క రోజులో పూర్తయ్యే పని కాదు. దశలవారీగా పనులు కొనసాగించేందుకు సిమెంట్‌, ఇసుక, కంకర, ఇటుకలు, కూలీల లభ్యత అవసరం. వీటిలో ఏ ఒక్కటి అందుబాటులో లేకపోయినా నిర్మాణం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇసుక సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే పునాదులు, గోడలు, ఇతర నిర్మాణ పనులపై ప్రభావం పడుతుంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యమైన గృహ నిర్మాణాల పురోగతి మందగించే ప్రమాదం ఉంది.

మంత్రి పొంగులేటి స్పందిస్తేనే..

రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకుంటే తప్ప ఇసుక సమస్య పరిష్కారం అయ్యేటట్లు లేదు. ఇళ్లనిర్మాణానికి టార్గెట్ పెట్టి ఆగడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మనఊరు-మన ఇసుక వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యతో ఒక ట్రాక్టర్ ఇసుక బుక్ చేసుకోవాలంటే 8 ట్రాక్టర్ల ఇసుక బుక్ చేసుకోవాలని చూపేడుతుంది. దీంతో మండల అధికారులు ఇసుక బుకింగ్ ను నిలిపివేశారు. ఉన్నతాధికారులకు నివేదించిన స్పందనరాలేదు. అయితే మంత్రి పొంగులేటి స్పందిస్తే తప్ప ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల సమస్యల పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. అయితే మంత్రి స్పందించి సాంకేతిక సమస్యను పరిష్కారిస్తారా? లేదా? అనేది చూడాలి.

Also read: కేవలం 14 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే.. శరీరంలో జరిగే మార్పులివే!

Tags

Related News

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

Big Stories

Advertisement
×