E-Paper
Advertisement

Mythri Flops: మైత్రీ మూవీ మేకర్స్ …. వరుసగా డిజాస్టర్ల వర్షం.. బయ్యర్ల గుండెల్లో గునపం

Mythri Flops: మైత్రీ మూవీ మేకర్స్ …. వరుసగా డిజాస్టర్ల వర్షం.. బయ్యర్ల గుండెల్లో గునపం
Advertisement

Mythri Flops:ఒకప్పుడు టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ అంటే అదొక తిరుగులేని సక్సెస్ ఫుల్ బ్రాండ్. నిర్మించిన ప్రతి సినిమా కాసుల వర్షం కురిపించడమే కాకుండా, బయ్యర్ల పాలిట కల్పవృక్షంలా వర్ధిల్లింది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గడిచిన ఏడాది కాలంలో వరుసగా అరడజను సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలవడంతో, అసలు ఈ అగ్ర నిర్మాణ సంస్థ నిలబడుతుందా? లేక చాప చుట్టేయాల్సిందేనా? అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బయ్యర్ల పాలిట ఈ బ్యానర్ ఇప్పుడు ఒక ‘శాపం’లా మారిందనే విమర్శలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

బయ్యర్ల కొంపముంచిన ‘డ్యూడ్’.. ప్రొడ్యూసర్ సేఫ్, బయ్యర్ ఖేల్ ఖతం!

గత ఏడాది కాలంలో మైత్రీకి కలిసొచ్చిన ఏకైక వెంచర్ ‘డ్యూడ్’ (ప్రదీప్ రంగనాథన్). అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. ఈ సినిమాతో మైత్రీ వారు నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారా భారీగా లాభపడి, బయటికి మాత్రం “ప్రాఫిట్ వెంచర్” అని కలరింగ్ ఇచ్చుకున్నారు. కానీ, లోపల జరిగిన కథ వేరేలా ఉంది! “మధ్యలో డ్యూడ్ వచ్చినా.. బయ్యర్లకు ఒరిగింది ఏమీ లేదు” అన్న చందంగా, థియేట్రికల్ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నిలువునా మునిగిపోయారు. ప్రొడ్యూసర్లు లాభాల చలికాచుకుంటుంటే, బయ్యర్లు మాత్రం రోడ్డున పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఫ్లాపుల పరంపర: వరుసగా ఆరు వికెట్లు!

Advertisement

మైత్రీ వారి రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే సామాన్య అభిమానులు సైతం షాక్‌కు గురవుతున్నారు. ఒక్కొక్కటిగా పరిశీలిస్తే:

JAAT: సన్నీ డియోల్‌తో బాలీవుడ్ మ్యాజిక్ చేద్దామనుకున్న ప్లాన్ కాస్తా ‘ఘాట్’ ఎక్కేసింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం హిందీలో యావరేజ్ అనిపించుకున్నప్పటికీ, ఓవరాల్‌గా మాత్రం భారీ నష్టాలనే మిగిల్చింది.

Advertisement

గుడ్ బ్యాడ్ అగ్లీ (GBU): అజిత్ క్రేజ్‌ను నమ్ముకుని తమిళంలో ఏదో మేనేజ్ చేసినా, తెలుగులో మాత్రం కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. దీనికి తోడు, సుమారు రూ .200 కోట్ల నష్టాల భయం ఇప్పుడు మైత్రీని వెంటాడుతోంది.

8 వసంతాలు: సినిమా నిడివి వసంతాల కాలంలా సాగదీయడంతో ఆడియన్స్‌కు పిచ్చెక్కిపోయింది. ఫలితంగా, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఎడారిని తలపించి అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది.

రాబిన్ హుడ్: పేరుకేమో రాబిన్ హుడ్.. కానీ వసూళ్ల దగ్గర మాత్రం ‘భిక్షగాడు’ రేంజ్‌లో చతికిలపడింది. నితిన్ కెరీర్‌లో ఇది మరో కోలుకోలేని డిజాస్టర్‌గా రికార్డు సృష్టించింది.

ఆంధ్రా కింగ్: ఇక రామ్ పోతినేని ‘మాస్’ పవర్ కూడా మైత్రీ వారి ‘ఐరన్ లెగ్’ను ఆపలేకపోయింది. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే థియేటర్లు ఖాళీ అవ్వడంతో, ఈ ‘కింగ్’ కాస్తా కలెక్షన్ల దగ్గర ‘బచ్చా’ అయిపోయాడు.

ఆఖరి ఆశ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. అది కూడా తుస్సుమనేనా?

ప్రస్తుతం థియేటర్లలో ఉన్న UBS (ఉస్తాద్ భగత్ సింగ్) మీదనే మైత్రీ వారి ఆశలన్నీ ఉన్నాయి. మార్చి 19న ఉగాది కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ చేసినా, బాలీవుడ్ సినిమా ‘ధురందర్’ ధాటికి ఈ ఉస్తాద్ నిలబడలేకపోతున్నాడు. నిజానికి, మొదటి రోజు ₹34 కోట్లు వచ్చినా, రెండో రోజే వసూళ్లలో దారుణమైన డ్రాప్ కనిపించింది. నెగెటివ్ రివ్యూలు తోడవడంతో, ఇది కూడా మైత్రీ ఖాతాలో మరో ఫ్లాప్ కిందే లెక్క అని  తేల్చి చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్.

 మైత్రీ జాతకం మారుతుందా?

వరుసగా వందల కోట్లు నష్టపోతున్నా, మైత్రీ మేకర్స్ ఇంకా కేవలం కాంబినేషన్ల మీద దృష్టి పెట్టి కథలను గాలికి వదిలేయడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం అన్నది ఇండస్ట్రీ టాక్ . ఇదే పరిస్థితి కొనసాగి.. రాబోయే పెద్ది, ఫౌజీ, డ్రాగన్ వంటి సినిమాలు కూడా తేడా కొడితే మాత్రం, టాలీవుడ్ మ్యాప్‌లో మైత్రీ పేరును వెతుక్కోవాల్సిందే!

read also:Koratala Crisis: కొరటాల శివ సీన్ రివర్స్: స్టార్ హీరోలంతా హ్యాండిచ్చారా?దేవర సక్సెస్ తర్వాత దారుణమైన పరిస్థితి

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×