E-Paper
Advertisement

Koratala Crisis: కొరటాల శివ సీన్ రివర్స్: స్టార్ హీరోలంతా హ్యాండిచ్చారా?దేవర సక్సెస్ తర్వాత దారుణమైన పరిస్థితి!

Koratala Crisis: కొరటాల శివ సీన్ రివర్స్: స్టార్ హీరోలంతా హ్యాండిచ్చారా?దేవర సక్సెస్ తర్వాత దారుణమైన పరిస్థితి!
Advertisement

Koratala Crisis : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒకప్పుడు ‘వరుస హిట్ల మెషిన్’ అని పిలిపించుకున్న కొరటాల శివ , ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ‘లో ఫేజ్’ను ఫేస్ చేస్తున్నారు. ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేసినా, ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం తారక్ మాస్ ఇమేజ్‌కే వెళ్ళిపోయింది తప్ప, కొరటాల మేకింగ్‌కు దక్కిన క్రెడిట్ మాత్రం  జీరో. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. కొరటాల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరోల చుట్టూ తిరుగుతుంటే, అందరూ ఇన్ డైరెక్ట్‌గా ‘సీన్ లేదు బ్రో’ అని చెప్పేస్తున్నారట.

బాలయ్య & పవన్ .. అసలు అపాయింట్‌మెంటే దొరకట్లేదా?
కెరీర్ డల్ అవుతోందని గ్రహించిన కొరటాల, బిగ్ లీగ్ హీరోలైన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ దగ్గరికి తన స్క్రిప్టులతో వెళ్ళారట. కానీ అక్కడ సీన్ మొత్తం మారిపోయినట్టు తెలుస్తుంది.బాలయ్య బాబు ఇప్పుడు ఫుల్ ‘చిల్’ మోడ్‌లో ఉన్నారు. కుర్ర డైరెక్టర్లు ఇచ్చే క్రేజీ అండ్ ఫాస్ట్ పేస్ ఐడియాలకే ఆయన ఓటు వేస్తున్నారు. కొరటాల పాతకాలపు ‘మెసేజ్ ఓరియంటెడ్’ స్లో నరేషన్ కథలను వినగానే, బాలయ్య బాబు సైలెంట్‌గా ‘ఇంకోసారి చూద్దాం లే’ అని పంపించేశారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. బాలయ్య ఇప్పుడు కొరటాల స్లో మేకింగ్‌ను భరించే మూడ్‌లో లేరని తెలుస్తోంది.మరో వైపు పవన్ ఆల్రెడీ తన లైనప్‌తో ఫుల్ బిజీ. కొరటాల సినిమా అంటే షూటింగ్ ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఈ ‘ల్యాగ్’ భయం వల్లే పవన్ ఆయన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. డైరెక్ట్ గా చెప్పాలంటే కొరటాల అక్కడ ‘ఘోస్ట్’ అయిపోయారన్న మాట .

Advertisement

చైతూ 25వ సినిమా ‘బ్రేక్ అప్’.. ఈగో అడ్డు వస్తోందా? 
ఇక యువ హీరో నాగచైతన్య 25వ ప్రతిష్టాత్మక సినిమా కొరటాల డైరెక్షన్‌లో ఉంటుందని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రాజెక్ట్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. కొరటాలకి ఇంకా ఆ ‘స్టార్ డైరెక్టర్’ అనే ఈగో తగ్గలేదన్నది ఇన్ సైడ్ టాక్ . మరి చిన్న లేదా మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడం తన రేంజ్‌కి తక్కువని ఆయన ఫీల్ అవుతున్నారా? లేక హీరోలే ఆయనతో రిస్క్ చేయలేక సైడ్ అయిపోయారా? అనేది ఇప్పుడు మిస్టరీ.

తారక్ కోసం ‘సింప్’ అవ్వాల్సిందేనా?
ఇక ప్రస్తుతానికి కొరటాల శివకు ఉన్న ఏకైక దిక్కు జూనియర్ ఎన్టీఆర్. కానీ తారక్ ఇప్పుడు గ్లోబల్ స్టార్! ‘డ్రాగన్’, ‘గాడ్ ఆఫ్ వార్ ‘ అంటూ హాలీవుడ్ లెవల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అంటే కొరటాల గారు మరో రెండేళ్లు కేవలం తారక్ డేట్స్ కోసం ‘వెయిటింగ్ లిస్ట్’లో ఉండాల్సిందే.”ఒకప్పుడు హీరోలే డైరెక్టర్ కాల్ షీట్స్ కోసం క్యూ కట్టేవారు.. ఇప్పుడు అదే డైరెక్టర్ హీరోల ఇన్ బాక్స్‌లో రిప్లై కోసం చూసుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. దీంతో  ”ఎలాంటి వాడివి ఎలా అయిపోయావ్  బ్రో!” అని ఇన్ స్టాలో తెగ రోస్ట్ చేస్తున్నారట నెటిజన్లు. ఇప్పటికైనా కొరటాల శివ తన పాతకాలపు స్లో నరేషన్‌ను వదిలి, అప్‌డేట్ అవ్వకపోతే.. త్వరలోనే ఆయన పేరు ఇండస్ట్రీలో ‘ఎక్స్‌పైరీ డేట్’ దాటిన లిస్టులోకి వెళ్ళిపోవడం ఖాయం . సో ..ఎన్టీఆర్ కనికరిస్తే తప్ప కొరటాలకు కెరీర్ సేఫ్ కాదు. ఒకరకంగా  ప్రస్తుతం ఆయన పరిస్థితి ‘డైలమా’లో కాదు  కాదు, ప్యూర్ ‘కెరీర్ క్రైసిస్’లో పడ్డట్టే కన్పిస్తుంది.

Advertisement

also read:Poonam Controversy: ‘రియల్ సింగ్’ vs ‘ఫేక్ సింగ్’..! టార్గెట్ పవన్ కళ్యాణేనా?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×