E-Paper
Advertisement

Naga Chaitanya: ‘వృషకర్మ’ క్లైమాక్స్.. ఇండియన్ సినిమాకే బెంచ్ మార్క్.. ప్రామిస్ చేస్తున్నా!

Naga Chaitanya: ‘వృషకర్మ’ క్లైమాక్స్.. ఇండియన్ సినిమాకే బెంచ్ మార్క్.. ప్రామిస్ చేస్తున్నా!
Advertisement

Naga Chaitanya: యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండు కాంబోలో రూపుదిద్దుకుంటోన్న నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వడానికి మేకర్స్ సినిమా సిద్ధ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగాయి. మార్చి 5, గురువారం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గ్లింప్స్ లాంచ్ వేడుకలో హీరో నాగ చైతన్య ఈ సినిమా గురించి చెబుతూ.. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని, ఇండియన్ సినిమాకే ఒక బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని అన్నారు.

Also Read- Vijay and Trisha: విజయ్-త్రిష అడ్డంగా దొరికేశారు.. ఒకే కారులో పెళ్లికి.. వీడియో వైరల్!

క్లైమాక్స్ మాములుగా ఉండదు

Advertisement

ఈ కార్యక్రమంలో నాగ చైతన్య (Naga Chaitanya) మాట్లాడుతూ.. ‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు కార్తీక్ చెప్పినట్టుగా.. ఇది నా కెరీర్‌లో 100 శాతం బెస్ట్ మూవీ కాబోతుంది. స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. ఇంత పెద్ద స్కేల్‌లో మిథికల్ థ్రిల్లర్ సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. నిజంగా, స్క్రిప్ట్ విన్నప్పుడే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కార్తీక్ బ్రిలియంట్ ఫిలిం మేకర్. ఈ కథ విన్నాక నేనొక లార్జెర్ దెన్ లైఫ్ సినిమా చేస్తున్నానని అనిపించింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందిస్తున్నారు. కార్తిక్ అనుకున్నది 100 శాతం అచీవ్ చేశారు. కార్తీక్ గురించి లైఫ్ లాంగ్ నేను మాట్లాడుకునేలా ఒక మంచి సినిమా నాకు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలన్నింటిని ఈ సినిమా అందుకుంటుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఇండియన్ సినిమాకే ఒక బెంచ్ మార్క్ అవుతుంది. ఇదే నా ప్రామిస్. ప్రతి ఒక్కరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీనాక్షి, జయరామ్, సత్య అందరూ అద్భుతమైన నటీనటులు ఇందులో ఉన్నారు. రాజీవ్ వీఎఫ్ఎక్స్, అజనీస్ మ్యూజిక్, నాగేంద్ర ప్రొడక్షన్ డిజైన్ ఇలా సాంకేతికంగా చాలా గ్రాండ్‌గా ఈ సినిమా ఉంటుందని చెప్పారు.

Also Read- Virosh Wedding: విరోష్ జంటకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు.. ఫొటోలు వైరల్!

కొత్త చైతన్యను చూస్తారు

Advertisement

దర్శకుడు కార్తీక్ దండు (Director Karthik Dandu) మాట్లాడుతూ.. ‘విరూపాక్ష’ సినిమా ఇచ్చిన సుకుమార్ సార్‌కి థాంక్యూ. సుకుమార్, బాపి, మా ముగ్గురి కాంబోనేషన్‌లో ‘విరూపాక్ష’ చేశాం. ఆ సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరింత గొప్ప సినిమా తీసే అవకాశం ప్రేక్షకులు నాకు ఇచ్చారు. క్వాలిటీ తగ్గకుండా చేయడానికి కావలసిన సపోర్టు మా నిర్మాతల నుంచి ఉంది. ప్రతి దర్శకుడికి పనిచేసే హీరోతో వాళ్ల కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలని ఉంటుంది. చైతన్య‌కు నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నాను. టెక్నీషియన్స్ అందరు కూడా అద్భుతంగా పని చేశారు. ఇందులో స్పర్శ్ చేస్తున్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు. ఆ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో అంతా కొత్త నాగ చైతన్యని చూస్తారని చెప్పుకొచ్చారు.

Also Read- Avika Gor: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్…వీడియో వైరల్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×