E-Paper
Advertisement

Nothing Phone 4a Pro: గ్లిఫ్ బార్, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ ఫోన్లు లాంచ్ చేసిన నథింగ్.. ఫుల్ ఫీచర్స్, ధరలు ఇవే

Nothing Phone 4a Pro: గ్లిఫ్ బార్, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ ఫోన్లు లాంచ్ చేసిన నథింగ్.. ఫుల్ ఫీచర్స్, ధరలు ఇవే
Advertisement

Nothing Phone 4a Pro| బ్రిటన్ స్మోర్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ భారత్‌తో పాటు పలు దేశాల్లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 4a ప్రో ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ మెరుగైన హార్డ్‌వేర్, మంచి కెమెరాలు, నథింగ్ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేక గ్లిఫ్ లైటింగ్ ఇంటర్‌ఫేస్‌లు ఉన్నాయి. డిజైన్ ఇన్నోవేషన్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టే నథింగ్, ఈ ఫోన్లలో పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెద్ద ఆమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను ప్రాధాన్యం ఇచ్చింది.

భారత్‌లో ధరలు, అందుబాటు

నథింగ్ ఫోన్ 4a మూడు వేరియంట్లలో వస్తుంది.

Advertisement

8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.31,999
8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.34,999
12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.37,999
లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్, గరిష్టంగా రూ.6,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. వైట్, బ్లూ, పింక్, బ్లాక్ కలర్లలో లభిస్తుంది.

నథింగ్ ఫోన్ 4a ప్రో ధరలు ఇలా ఉన్నాయి:

Advertisement

8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.39,999
8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.42,999
టాప్ వేరియంట్ స్టోరేజ్ ధర రూ.45,999
సిల్వర్, పింక్, బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. నథింగ్ ఫోన్ 4a మార్చి 13 నుంచి, నథింగ్ ఫోన్ 4a ప్రో మార్చి 27 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి.

డిస్‌ప్లే, పెర్ఫామెన్స్

నథింగ్ ఫోన్ 4aలో 6.78 ఇంచ్ LTPS ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంది. దీని రెసల్యూషన్ 1224*2720 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా జరుగుతాయి. 2,160Hz PWM డిమ్మింగ్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఇస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతాయి.

కెమెరా ఫీచర్లు

రెండు ఫోన్లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (f/1.88 అపర్చర్) ఉంది. దీంతో తక్కువ లైట్‌లో కూడా మంచి ఫోటోలు తీయవచ్చు. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా. సూపర్ డీటెలింగ్ ఫొటోలు తీయడానికి ఇందులో అడ్వాన్స్‌డ్ జూమ్‌ కూడా ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్.. వైడ్ ఫోటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఉపయోగపడుతుంది.

గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్, స్పెషల్ ఫీచర్లు

కొత్తగా రీడిజైన్ చేసిన గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌లో వెనక భాగంలో 63 మినీ LED లైట్లు ఉన్నాయి. ఇవి నోటిఫికేషన్లు, అలర్ట్స్ చూపిస్తాయి. వాల్యూమ్ ఇండికేటర్‌గా కూడా పనిచేస్తాయి. స్క్రీన్ ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్లు చూడవచ్చు. ఫ్లిప్-టు-రికార్డ్ ఫీచర్‌తో ఫోన్ తిప్పితే వాయిస్ రికార్డింగ్ మొదలవుతుంది. కెమెరా కౌంట్‌డౌన్ టైమర్ కూడా లైట్లలో కనిపిస్తుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ సెక్యూరిటీ

5,400mAh బ్యాటరీ ఉంది. 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో సుమారు 64 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 4G, 5G, వై-ఫై, బ్లూటూత్, NFC, GPS, బైడౌ నావిగేషన్ సపోర్ట్ ఉన్నాయి. USB Type-C పోర్ట్ ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో సెక్యూరిటీ ఇస్తుంది.

Also Read: రూ.10 లక్షల స్టూడియోకి నిప్పంటించిన యుట్యూబర్.. సబ్‌స్క్రైబర్స్ పెరగడంలేదని కోపం.. కానీ

డిజైన్, బిల్డ్

ఫోన్ సైజు 163.95* 77.57*8.55 mm, బరువు సుమారు 205 గ్రాములు. నథింగ్ సంస్థ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఉంది. గ్లిఫ్ లైటింగ్ వల్ల ఫోన్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×