E-Paper
Advertisement

Sundar C : రజనీకాంత్ ను పక్కనపెట్టి విశాల్ తో సినిమా, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Sundar C : రజనీకాంత్ ను పక్కనపెట్టి విశాల్ తో సినిమా, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే
Advertisement

Sundar C : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 173 వ సినిమాకి సుందర్ దర్శకత్వం వహిస్తారు అని చాలా న్యూస్ వచ్చాయి. ఆ తర్వాత కాలంలో అధికారికంగా కూడా ఈ కాంబినేషన్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా అయిపోయింది. ఇన్ని జరిగిన తర్వాత సోషల్ మీడియాలో సడన్ గా ఒక న్యూస్ వైరల్ గా మారింది. రజనీకాంత్ 173 వ సినిమా నుంచి సుందర్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే దానిని అధికారకంగా ప్రకటించక ముందే సుందర్ ప్రెస్ నోట్ విడుదల చేసేసారు.

ఆ ప్రెస్ నోట్ విడుదల చేసినంత వరకు కూడా కమలహాసన్ రజనీకాంత్ కి కూడా ఈ విషయం తెలియదు అని వార్తలు కూడా వినిపించాయి. ఏదేమైనా సుందర్ మరియు రజనీకాంత్ కాంబినేషన్ లో మంచి సినిమాలు కూడా వచ్చాయి. ఈ సినిమా ఆగిపోయిన వెంటనే సుందర్ గ్యాప్ తీసుకోకుండా మరో హీరోతో సినిమా చేయడం మొదలుపెట్టాడు.

విశాల్ తో సినిమా 

Advertisement

హీరో విశాల్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. ఒకప్పుడు విశాల్ సినిమాకి మంచి మార్కెట్ ఉండేది తర్వాత కాలంలో విశాల్ సినిమాలు చేయడం తగ్గించడంతో, అలానే చాలామంది తమిళ్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడంతో విశాలకున్న మార్కెట్ కూడా కొంచెం తగ్గిపోయింది.

ఇకపోతే సుందర్ ప్రస్తుతం విశాల్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించిన ఉంది. హిప్ హాప్ తమిజ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

రజినీకాంత్ సినిమా ఆగిపోవడానికి కారణం 

Advertisement

రజనీకాంత్ కు మొదట ఒక లైన్ చెప్పారట సుందర్. ఆ లైన్ రజనీకాంత్ కు విపరీతంగా నచ్చింది. కానీ పూర్తి కథ చెప్పమన్నప్పుడు దానితో రజినీకాంత్ ఇంప్రెస్స్ కాలేకపోయారు. కొన్ని మార్పులు కూడా చేయమని చెప్పారు. కానీ సుందర్ మార్పులు చేసినా కూడా అది రజినీకాంత్ ను సంతృప్తి పరచలేదు. కేవలం అతను చెప్పిన మార్పులు వలనే ఆ సినిమా ఆగిపోయింది.

మరోవైపు రజినీకాంత్ 173 వ సినిమా చేయడానికి పలువురు దర్శకులు పేర్లు రోజుకొకటి వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం పార్కింగ్ దర్శకుడు రామ్ కుమార్ రజనీకాంత్ సినిమా చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: Venu Udugula : ప్రొడ్యూసర్ దొరికినంతవరకు శ్రీ విష్ణు శాలరీ ఇచ్చాడు, ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×