CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని రానున్న 25 ఏళ్లలో దేశంలోనే అగ్రస్థానానికి తీసుకువెళ్లేలా సమగ్ర విధానంతో ముందుకు సాగాలని సీఎం స్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య, మౌలిక వసతుల అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నా రెడ్డి,ప్రభుత్వ సలహాదారులు కే కేశవ రావు, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
వీ హబ్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న.. డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన వీ – ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, మహిళల పురోగతే రాష్ట్ర పురోగతికి పునాదని అన్నారు.
ఔటర్ రింగురోడ్డు ఔట్‌సైడ్ కొత్తగా రీజినల్ రింగురోడ్డు రాబోతోంది. 360 కి.మీతో మరో మణిహారంగా మార్చుకోబోతున్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్ వేయడానికి అనుమతి తెచ్చాం. హైదరాబాద్, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెంచాలి. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో ఎయిర్‌పోర్ట్‌లు తెస్తున్నాం అన్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను మూడు విభాగాలుగా తీసుకున్నాం. కాలుష్య రహిత నగరంగా మార్చాలంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. ఔటర్ లోపల నాలుగు విభాగాలు ఉండేవి, దాంతో గందరగోళం ఏర్పడింది. అందుకే ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించాం. కోర్ అర్బన్ రీజియన్‌ను ఒక విభాగంగా తీసుకున్నాం అని సీఎం రేవంత్ అన్నారు.
సమీక్ష సమావేశంలో తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్‌తో పాటు.. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. ఈ సమ్మిట్ తెలంగాణకు ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే వేదికగా నిలవాలని, అందువల్ల ప్రతి శాఖ పూర్తి స్థాయిలో సమర్పణతో పనిచేయాలని సీఎం ఆదేశించారు.
ఈ విజన్ డాక్యుమెంట్‌ను మరింత బలంగా రూపొందించేందుకు రేపు, ఎల్లుండి రాష్ట్ర మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తమ తమ శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో చర్చించి, లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కేవలం సిద్ధాంత స్థాయిలో కాకుండా, అమలుకు అనువైన కార్యాచరణ ప్రణాళికతో నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి శాఖ తమకు బాధ్యతగా ఉన్న రంగానికి సంబంధించిన ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్ అవసరాలు, సమస్యలు, అవకాశాలు, పెట్టుబడుల అవసరం, ఉద్యోగ సృష్టి అవకాశాలు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఈ విధంగా సిద్ధం చేసిన నివేదికలను ఈ నెల 2వ తేదీ రాత్రి నాటికి తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది.
అనంతరం 3వ, 4వ తేదీల్లో అన్ని శాఖల నుంచి వచ్చిన నివేదికలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్), స్పెషల్ సీఎస్‌లు, ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలిస్తారు. అవసరమైన మార్పులు, చేర్పులు, సూచనలు అందులో చేర్చి విజన్ డాక్యుమెంట్ తుది ప్రతిని సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఎలాంటి లోపాలు లేకుండా, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి పటిష్టమైన పునాదిగా నిలిచేలా ఈ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ నెల 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ ..సంపూర్ణంగా సిద్ధం కావాలని సీఎం స్పష్టమైన గడువు విధించారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా, తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే కీలక పత్రం కావడంతో నిర్లక్ష్యానికి చోటు ఉండకూడదని సీఎం హెచ్చరించారు.
Also Read: సోమవారం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన.. కవిత అభ్యంతరం, అదీ అసలు మేటర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల విషయంలో కూడా సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సదస్సు నిర్వహణలో అన్ని శాఖల మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉండాలని, ఎక్కడా సమాచార లోపాలు, ఆలస్యాలు జరగకూడదని ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం, మౌలిక వసతులు, విద్య, వైద్యం, పర్యాటకం వంటి కీలక రంగాలకు సంబంధించిన శాఖలు పరస్పరం సమన్వయంగా పనిచేసి గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
మరికాసేట్లో సచివాలయంలో సీఎం, మంత్రుల మీడియా సమావేశం pic.twitter.com/OE72WD0YwG
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2025