E-Paper
Advertisement

Most Visited States: 2024-25లో ఎక్కువ మంది సందర్శించిన రాష్ట్రాలు ఇవే, ఫస్ట్ ర్యాంక్ దేనికి దక్కిందంటే?

Most Visited States: 2024-25లో ఎక్కువ మంది సందర్శించిన రాష్ట్రాలు ఇవే, ఫస్ట్ ర్యాంక్  దేనికి దక్కిందంటే?
Advertisement

Most Visited States India: 2010 తర్వాత భారత్ పర్యాటక రంగం పరంగా రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఏటా విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీ టూరిస్టులు పలు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.  2024లో పర్యాటకుల వృద్ధి మరింత పెరిగింది. పర్యాటక రంగంలో మొత్తం వృద్ధి 17.51%కి చేరింది. మొత్తం దేశీయ పర్యాటకుల సందర్శనలలో మొదటి ఐదు రాష్ట్రాలు 60.38% వాటా కలిగి ఉన్నాయి. దేశం 2021లో 11.05%, 2022లో 155.45%, 2023లో 45.04%, 2024లో 17.51% వృద్ధిని నమోదు అయ్యింది.

రాష్ట్రాల వారీగా పర్యాటకుల ర్యాంకింగ్స్

టాప్ 5 రాష్ట్రాల్లో మొదటి మూడు రాష్ట్రాలు నార్త్ ఇండియాకు చెందినవే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ జాతీయ పర్యాటకుల వాటాలో 21.94% వాటా కలిగి ఉంది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లతో పాటు, ఉత్తరాది రాష్ట్రాలు గత సంవత్సరం మొత్తం 894.933 మిలియన్ల మంది సందర్శించారు. విదేశీ రాకపోకల పరంగా, నార్త్ ఇండియాకు 2024లో 2.269 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. అదే సమయంలో, దక్షిణాది రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 901.672 మిలియన్ల దేశీయ పర్యాటకులు సందర్శించారు.

దేశంలో ఎక్కువ మంది సందర్శించిన రాష్ట్రాలు  

Advertisement

⦿ ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్ చారిత్రక, ఆధ్యాత్మికత, సంస్కృతిక గొప్పదనాన్ని మిళితం చేస్తుంది. వారణాసి, అయోధ్య, తాజ్ మహల్ సహా  పురాతన నగరాలు, పండుగలు పర్యాటకులను ఆకర్షించాయి. మొత్తం సందర్శకులు 646.8 మిలియన్లు. 2023 సందర్శకులు 478.52 మిలియన్లు. వృద్ధి +35.17%.

Advertisement

⦿ తమిళనాడు

యునెస్కో-జాబితా చేయబడిన బృహదీశ్వర ఆలయం, పొగమంచుతో కూడిన నీలగిరి కొండలు, ప్రశాంతమైన బీచ్‌లు, ప్రశాంతమైన తీర పట్టణాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2024లో మొత్తం సందర్శకులు 306.8 మిలియన్లు. 2023 సందర్శకులు 286.01 మిలియన్లు. వృద్ధి +7.28%.

⦿కర్ణాటక

పచ్చని కాఫీ తోటలు, అద్భుతమైన జలపాతాలు, గోకర్ణ బీచ్‌లు, మైసూరు-కర్ణాటక రాజభవనాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.  2024లో సందర్శకులు 304.6 మిలియన్లు. 2023 సందర్శకులు 284.12 మిలియన్లు. వృద్ధి +7.20%.

⦿ ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం ప్రశాంతమైన బీచ్‌ల నుంచి తిరుపతి ఆధ్యాత్మిక ప్రకాశం వరకు, ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను కలిగి ఉంది. బెలుం గుహలు, అరకు లోయ ఆకట్టుకుంటుంది. 2024లో సందర్శకులు 290.3 మిలియన్లు. 2023 సందర్శకులు 254.71 మిలియన్లు. వృద్ధి +13.96%.

⦿ రాజస్థాన్

రాజ్‌ పుత్ యోధుల యుగానికి, రాజరికానికి మిమ్మల్ని తీసుకెళ్లే రాష్ట్రం రాజస్థాన్. బంగారు వర్ణపు ఎడారులు, ఒంటెలు, సాంప్రదాయ జానపద కళలు రాజస్థాన్‌ ను ఒక పర్యాటక డెస్టినేషన్ గా మార్చాయి. 2024లో సందర్శకుల సంఖ్య 230.1 మిలియన్లు. 2023లో సందర్శకులు 179.05 మిలియన్లు. ఏడాదిలో +28.50% వృద్ధి సాధించింది.

Read Also: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×