E-Paper
Advertisement

Naga Chaitanya: చాలామంది భయపెట్టారు, కానీ నాకు అవంటే పిచ్చి ఇష్టం

Naga Chaitanya: చాలామంది భయపెట్టారు, కానీ నాకు అవంటే పిచ్చి ఇష్టం
Advertisement

Naga Chaitanya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో నాగచైతన్య ఒకరు. తన హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాతోనే సమంతకి నాగచైతన్య కు మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ వరకు దారితీసింది. తర్వాత వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. కొన్ని కారణాల వలన విడిపోయారు.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికీ లవ్ స్టోరీస్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎక్కువ శాతం లవ్ స్టోరీ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తాయి. అయితే చాలామంది తెలుగు హీరోలు కూడా లవ్ స్టోరీ సినిమా చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు. తాజాగా లవ్ స్టోరీస్ పైన తనకున్న ఒపీనియన్ షేర్ చేశాడు నాగచైతన్య. ఆనంది మరియు ప్రియదర్శి కలిసిన నటించిన ప్రేమంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు నాగచైతన్య.

లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం 

Advertisement

నాగచైతన్య ఈవెంట్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒక లవ్ స్టోరీ ని ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం. కోవిడ్ తర్వాత యాక్షన్ మూవీస్, వరల్డ్, యూనివర్స్ సినిమాలే చూస్తారని భయపెట్టారు. ఇప్పుడు ప్రేమంటే సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది నవనీత్ నీకు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పాడు.

నాగచైతన్య కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఏ మాయ చేసావే, మజిలీ, లవ్ స్టోరీ వంటి సినిమాలే ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. ఇవన్నీ కూడా మంచి లవ్ స్టోరీస్. ఇప్పటికీ కూడా ఒక లవ్ స్టోరీ సినిమా సిద్ధం చేసి నాగచైతన్యకు చెప్తే ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి.

ప్రియదర్శి మోస్ట్ వెర్సటైల్ యాక్టర్

Advertisement

ప్రియదర్శి మోస్ట్ వెర్సటైల్ యాక్టర్. చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని కాకుండా సినిమాల్లో కొన్ని కీలక పాత్రలు చేస్తూ మరోవైపు లీడ్ యాక్టర్ గా నటిస్తూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు దాని గురించి నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను.

ఆనందితో గతంలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను ఆవిడతోని వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తెలుగు అండ్ తమిళ్ లో మీరు బాగా చేస్తున్నారు విష్ యు ఆల్ ది బెస్ట్. సుమ గారు మంచి సప్రైజ్ ఇచ్చారు. ఈవెంట్స్ లో సుమ గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు అలాంటిది ఒక సినిమాలో పోలీస్ మాత్ర అంటే ఇంకా థియేటర్లో బ్లాస్ట్ అయిపోయినట్లే అంటూ నాగచైతన్య మాట్లాడారు.

Also Read: Ram Pothineni: చాలా ఏళ్లు తర్వాత ఇండస్ట్రీకి ఇలాంటి అమ్మాయి వచ్చింది, రామ్ ఎలివేషన్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×