Ram Pothineni: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో రామ్ పోతినేని ఒకరు. ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు రామ్. రీసెంట్ టైమ్స్ లో రామ్ చేస్తున్న సినిమాలవి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో వర్కౌట్ కావడం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఊహించని స్థాయిలో ఒక హిట్ సినిమా కూడా రామ్ పడలేదు.
డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా ఊహించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కేం తాలూకా అనే సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తరుణంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్నూల్ లో నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం ఈ ట్రైలర్ విడుదలైంది. ఈ ఈవెంట్ లో రామ్ మాట్లాడిన స్పీచ్ వైరల్ గా మారింది.
ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచే రామ్ గురించి పది రకాల వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. భాగ్యశ్రీ తో రామ్ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు చాలా కథనాలు వినిపించాయి. అంతేకాకుండా రామ్ ఈ సినిమాలో మొదటిసారి సాహిత్యం అని కూడా రాశాడు. సెకండ్ పాటను ని రాం పాడాడు.
భాగ్యశ్రీ గురించి రామ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత గ్లామర్ గా కనిపిస్తూ, పెర్ఫార్మ్ చేసే యాక్ట్రెస్ వచ్చింది ఇండస్ట్రీ కి అంటూ భాగ్యశ్రీ గురించి రామ్ చెప్పాడు. అలానే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని విపరీతంగా నమ్ముతున్నట్లు కూడా తన స్పీచ్ వింటే అర్థమయిపోతుంది.
అతనికి ఈ సినిమా ట్రైలర్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. రాము ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇస్తాడు అని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ఆల్రెడీ మంచి సక్సెస్ అయిపోయింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇప్పటికే దర్శకుడు మహేష్ బాబు మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. రారా కృష్ణయ్య సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ కు నవీన్ పోలిశెట్టి నటించిన మీశెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. అటువంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి కొంతమేరకు అంచనాలు ఉండటం సహజం.
Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకు ట్రైలర్ వచ్చేసింది, రామ్ కం బ్యాక్ ఇస్తాడా?