E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : సంజనపై బిగ్ బాస్ శాడిజం.. బాలింతను పట్టుకుని ఏందయ్యా ఆ అరాచకం

Bigg Boss 9 Telugu : సంజనపై బిగ్ బాస్ శాడిజం.. బాలింతను పట్టుకుని ఏందయ్యా ఆ అరాచకం
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్న కంటెస్టెంట్స్ లో సంజనకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఫిజికల్ గా పెద్దగా ఆడకయినా ఇప్పటిదాకా హౌస్ లో ఆమె కొనసాగడానికి అదే కారణం. తప్పుల మీద తప్పులు చేస్తూ దొంగగా పేరు తెచ్చుకున్న ఈవిడను బిగ్ బాస్ చేస్తున్న టార్చర్ మాములుగా లేదు. ఇన్నాళ్లూ ఆ దొంగతనాల వల్ల సంజనను తిట్టుకున్న జనాలు ఇప్పుడు బిగ్ బాస్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇంతకీ ఆడియన్స్ అంతగా ఫైర్ అయ్యేలా సంజన విషయంలో బిగ్ బాస్ ఏం చేశారో తెలుసుకుందాం పదండి.

ఫ్యామిలీ వీక్ కట్

లాస్ట్ వీకెండ్ హోస్ట్ నాగార్జున ముంచేదెవరు తేల్చేది ఎవరు అంటూ కంటెస్టెంట్స్ కు టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ టాస్క్ లో ఎక్కువ మంది సంజన ముంచేస్తుందని చెప్పడంతో ఆమెపై బిగ్ బాంబ్ వేశారు. సంజనకు ఫ్యామీలీ వీక్ కట్ అంటూ పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో అక్కడే సంజన డీలా పడిపోయింది. ఇప్పటికే నేను ఎవ్వరికీ తెలియకుండా 6 సార్లు, బయట 3 సార్లు ఏడుస్తున్నా. ఫ్యామిలీ వీక్ లేకుండా ఉండలేను నేను చచ్చిపోతా. నేను ఇంటికి వెళ్ళిపోతా” అని గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో హౌస్ మేట్స్ ఆమెను ఓదార్చారు. అంతేకాదు నాగార్జునను ఈ విషయంలో ఏదైనా చేయమని వేడుకున్నారు. భరణి, కళ్యాణ్ అయితే ఏకంగా తమ ఫ్యామిలీ వీక్ ను కూడా వదులుకుంటామన్నారు. కానీ నేను చేయాల్సింది చేశాను, మిగతాది బిగ్ బాస్ చూసుకుంటారు అని చెప్పేశారు నాగ్.

సంజనపై ఎందుకింత శాడిజం ?

Advertisement

ఇక హౌస్ లో నోరు జారినా, ఎగ్స్ దొంగతనం చేసినా… సంజనకు మంచి ఫాలోయింగ్ ఉంది బయట. ఎందుకంటే ఆమె కల్మషం లేకుండా డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది. అలాగే ఎలాంటి సిట్యువేషన్ లో అయినా ఆటను తన వైపుకు తిప్పుకుంటుంది. బాగా ఎంటర్టైన్ చేస్తుంది కూడా. దొంగ అన్న నాగ్ తోనే శభాష్ చెప్పించుకుంది సంజన. ఇక ఆమె తన ఇద్దరు పిల్లలను షో కోసం వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. నెలల పిల్లాడిని వదిలి రోజూ నరకం అనుభవిస్తున్నట్టు ఆమె ఎన్నోసార్లు చెప్పింది. ఇక ఇప్పటికే సంజనకు ఫ్యామిలీ వీక్ కట్ చేసిన బిగ్ బాస్… తాజాగా ఫ్యామీలీ వీక్ లో తనూజా అక్క కూతురుని ఇంట్లోకి పంపి సంజనను మరింత మెంటల్ టార్చర్ పెట్టాడు. ఆ పాపలో తన పిల్లలను చూసుకుంటూ ‘ఇన్ని రోజులూ అన్ని మర్చిపోయి ఉన్నాను. ఇప్పుడు కష్టంగా ఉంది. కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీ రావడం చూసి నేను సంతోషపడాలి. నా ఫ్యామిలీ కూడా వస్తుంది కదా’ అంటూ తన ఫ్యామిలీ వీక్ ను కట్ చేసిన బిగ్ బాస్ ను వేడుకుంది. సంజన తన బిడ్డను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆడియన్స్ గుండె తరుక్కుపోతోంది. చివరకు బిగ్ బాస్ ఎలాగూ ఆమె ఫ్యామిలీని కూడా హౌస్ లోకి పంపుతారు. మరి ఇంకెందుకు ఇంత శాడిజం అని బిగ్ బాస్ ను తిట్టి పోసుకుంటున్నారు ఆడియన్స్.

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×