Vrushakharma : స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ చిత్రం వృషకర్మ.. ఈ ఏడాది నాగచైతన్య నుంచి వచ్చిన తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత నాగచైతన్య నటిస్తున్న ఈ కొత్త సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.. అయితే ఇప్పటికే ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ వృషకర్మ ‘. భారీ యాక్షన్ చిత్రంలో రాబోతున్న ఈ సినిమాపై జనాల్లో కాస్త అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్లో రాబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రం రిలీజ్ కాతుంది. అయితే ఏ డేట్ న రిలీజ్ అవుతుందో అన్నది త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.. నిజానికి డిసెంబర్ లో ఎటువంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా నేను రిలీజ్ చేయబోతున్నారు అంటూ టాక్..
అక్కినేని నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీగా రాబోతున్న ఈ మూవీ కోసం అటు ఫ్యాన్స్, ఇటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గతంలో విరూపాక్ష మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. దాదాపు షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి.. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాలలో థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ వంశీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 10 కోట్ల రూపాయలకు బిజినెస్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ దాదాపు 55 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందా? లేదా అన్నది తెలియలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..