Vrusha Karma: 2026వ సంవత్సరంలో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ నుంచి మొదలుకొని వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న సినిమాలలో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా ఒకటి. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ విడుదల కాబోతోంది.
ఈ క్రమంలోనే మీనాక్షి చౌదరితో పాటు ఇతర చిత్ర బృందం వరుస ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే నేడు ఉదయం మీనాక్షి చౌదరి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు .అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈమె తన తదుపరి ప్రాజెక్టుల గురించి కీలక అప్డేట్ వెల్లడించారు. ప్రస్తుతం నాగచైతన్యతో తాను వృషకర్మ(Vrusha Karma) అనే సినిమాలో నటిస్తున్నానని తెలియజేశారు. ఈ సినిమా ఈ ఏడాది మిడిల్ లో విడుదలకాబోతోంది అంటూ వృషకర్మ విడుదల గురించి మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఏడాది మిడిల్ అంటే వృషకర్మ సినిమా జూన్ లేదా జూలై నెలలో విడుదల కాబోతుందని తెలుస్తోంది.
పురుషకర్మ సినిమాకు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైథాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో పురావస్తు శాఖ సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈమెకు సంబంధించిన పస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. నాగచైతన్య ఇప్పటివరకు టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నాగచైతన్య ధర్మాన్ని కాపాడే యోధుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
మైథాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో..
ఇలా నాగచైతన్య మీనాక్షి చౌదరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది మిడిల్ లో విడుదల కాబోతుంది అంటూ మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా షూటింగ్ జరుగుతున్నాయని అయితే ఈ సినిమాల గురించి మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు అంటూ మీనాక్షి చౌదరి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Meenakshi Chaudary: డాక్టర్ అయ్యాను.. యాక్టర్ అయ్యాను..ఇక టార్గెట్ అదే..