E-Paper
Advertisement

ఈమెని వదిలితే ఇన్‌స్టా తగలబడిపోద్ది..నాగదుర్గపై బన్నీ వాస్ సెటైర్లు !

ఈమెని వదిలితే ఇన్‌స్టా తగలబడిపోద్ది..నాగదుర్గపై బన్నీ వాస్ సెటైర్లు !
Advertisement

Naga Durga:ఫోక్ ఇండస్ట్రీలో ఒక క్వీన్ లా వెలిగిపోయిన నాగ దుర్గ తాజాగా ‘ఇడుపు కాయితం’ అనే సినిమాలో ప్రియదర్షికి జోడీగా నటిస్తున్న సంగతి తెల్సిందే. వంశీ కృష్ణ దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి తాజాగా గడప అనే పాటని వదిలింది మూవీ టీమ్. ఈ సందర్భంగా నాగ దుర్గ షూటింగ్ సమయంలో జరిగిన పలు ఆసక్తి కరమైన సంఘటలని చెప్పి స్టేజ్ పై నవ్వులు పూయించింది.

గడప పాటతో తనకెంతో అనుబంధం ఉందన్న నాగదుర్గ

Advertisement

ఈవెంట్ లో మాట్లాడుతూ ‘ఇడుపు కాయితం’ జర్నీలో ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైనదని ,ఈ గడప పాట అందరికీ కనెక్ట్ అయిందని తాను భావిస్తున్నట్లు తెలిపింది.ఇక ఈ పాటలోని భావాలు తన వ్యక్తిగత జీవితానికి కూడా దగ్గరగా ఉన్నాయని ,ఇంట్లో తాను ఏదైనా అల్లరి చేసినా, అమ్మానాన్నలు పెళ్లి తర్వాత అత్తగారింటికి వెళ్లాక తెలుస్తుందని సరదాగా అంటుంటారని చెప్పుకొచ్చింది.అలా
ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు పాటలోని ఎమోషన్స్ తనకు మరింత దగ్గరగా అనిపించాయని తెలిపింది.

కూతురి నటన చూసి ఎమోషనల్ అయిన నాన్న

Advertisement

నాగదుర్గ తన తండ్రి గురించి మాట్లాడుతూ సాధారణంగా తన యాక్టింగ్ గురించి తన తండ్రి ఎప్పుడూ పెద్దగా మెచ్చుకోడని,కానీ గడప పాట ప్రోమో విడుదలైన తర్వాత ఫోన్ చేసి మరీ తనను అభినందించారని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనను అలా తెరపై చూసినప్పుడు ఏడుపు వచ్చిందని, కళ్లలో నీళ్లు తిరిగాయని తండ్రి చెప్పాడని ఎమోషనల్ అయ్యింది. తన తండ్రి అలా తన యాక్టింగ్ చూసి ఎమోషనల్ అవ్వడం తనకి ఏంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది.

ఇకపోతే నాగదుర్గ నుంచి శ్రీలతగా మారడానికి తాను చాలా కష్టపడ్డానని, ఆ కష్టాన్ని ప్రేక్షకులు తప్పకుండా గుర్తించాలని కోరింది. శ్రీలత అనేది కేవలం సినిమాలోని పాత్ర మాత్రమే కాదని, ప్రతి ఇంట్లో కనిపించే అమ్మాయికి ప్రతిరూపమని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినందుకు కాదు.. 

ఇక ఈ సినిమా కోసం తనను ఎంపిక చేసిన దర్శకుడు, నిర్మాతలు, మూవీ టీమ్ కి స్పెషల్ థాంక్స్ అని చెప్పుకొచ్చింది.ముఖ్యంగా కెరీర్ బిగినింగ్ లోనే సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ వంటి బ్యానర్లలో హీరోయిన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపింది. అయితే తనకు అవకాశం ఇచ్చిన దానికన్నా ఇందులోని శ్రీలక్ష్మి పాత్రని నేను చేయగలను అని నమ్మినందుకు
ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ,కొత్త అమ్మాయిగా తనపై ఇంత పెద్ద బాధ్యత ఉంచడం తనకు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

దర్శి ర్యాగింగ్‌పై నాగదుర్గ ఫన్నీ కంప్లైంట్స్!

ఇక ఇందులోని హీరో ప్రియదర్శి గురించి మాట్లాడుతూ తనకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటూనే దర్శి ఆటపట్టిస్తుంటారని నవ్వుతూ తెలిపింది. షూటింగ్ సమయంలో దర్శి తనను ర్యాగింగ్ చేసేవారని, ఆయనతో పడలేక ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తానని అనుకున్నానని పేర్కొంది. తన కాలేజీ రోజుల్లో కూడా సీనియర్లు పెద్దగా ర్యాగింగ్ చేయలేదని, తన తండ్రి పోలీస్ అని చెప్పేదాన్నని,కానీ దర్శి మాత్రం ఎవరికీ భయపడరని, తన మాటలు పట్టించుకోకుండా మరింత ఆటపట్టించేవారని సరదాగా షూటింగ్ రోజులని గుర్తు చేసుకుంది.

ఇక ఇలా దర్శి ఆటపట్టిస్తుంటే.. ‘మా వాసు సర్ కి చెప్తా’ అని బెదిరించేదాన్నని తెలిపింది.ఇక ఒకసారి బన్నీ వాసు సెట్‌కు వచ్చినప్పుడు ఆయనకు కంపైంట్ చేస్తానని చెప్పినా దర్శి అస్సలు తగ్గలేదని పైగా ‘పో.. చెప్పుకో పో’ అంటూ ఆన్సర్ ఇచ్చేవారని నవ్వుతూ వివరించింది. మరోసారి తనను ఇబ్బంది పెడుతున్నారని చెబుతానంటే, ‘మీ పెద్దరెడ్డి వచ్చాడు కదా.. పో చెప్పుకో’ అని అన్నారని సరదాగా వాపోయింది.

ఇలాగే మాట్లాడితే ఇన్‌స్టా తగలబడిపోద్ది

ఇక నాగ దుర్గ అలా అనగానే బన్నీ వాసు రియాక్ట్ అవుతూ నువ్ అలా పెద్దరెడ్డి అంటే సోషల్ మీడియాలో తనను ‘పెద్దరెడ్డి’ అని పిలుస్తారేమోనని,ఇక ఇంస్టాలో మొత్తం నేనే ఉంటానని, దయచేసి ఇక ఆపు నువ్వు గనుక ఇంకో రెండు నిమిషాలు గనుక ఇలాగే మాట్లాడితే ఇన్‌స్టా తగలబడిపోద్ది అంటూ సెటైర్ వేశాడు బన్నీ వాసు.మొత్తంగా నాగ దుర్గ, బన్నీ వాసుల మధ్య జరిగిన ఈ సంభాషణ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.

ALSO READ :కళ్లకు చూపు లేదు.. కానీ పాటలతో ఫేమస్! రషీద్, సమీరా జీవితంలో ఇన్ని కష్టాలా?

Tags

Related News

ఇడుపు కాయితం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి?

‘గరివిడి లక్ష్మి’ సినిమాని ఇంత మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారా?

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రన్ టైం లాక్.. కీలక సన్నివేశాలు డిలీట్ చేసిన గురూజీ!

ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మారుతి.. వార్నింగ్లు ఇస్తున్న ఫ్యాన్స్

ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రాజకీయాల వల్ల కోట్లు పోగొట్టుకున్న నటుడు?

“వయలెంట్ మ్యాన్” ప్రభాస్ కి ‘సలార్ 2’ టీమ్ స్పెషల్ బర్తడే విషెస్.. క్రేజీ అప్డేట్ వైరల్!

Big Stories

Advertisement
×