Trisha -Vijay:ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. కొంతమంది కుటుంబ సమస్యల కారణంగా విడాకులు తీసుకుంటే.. మరికొంతమంది ఇండస్ట్రీలో ఉండే మరొకరి మీద వ్యామోహంతో కట్టుకున్న భార్యకు విడాకులు ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న విజయ్ దళపతి (Vijay thalapathy) భార్యతో పాటు పిల్లలు ఉన్నప్పటికీ ప్రముఖ హీరోయిన్ త్రిష(Trisha) తో రిలేషన్ పెట్టుకున్నారనే కారణం తోనే ఆయన భార్య సంగీత(Sangeetha ) త్రిష పేరును ప్రస్తావించకుండా సినీనటి అని చెప్పి విడాకుల కోరింది. ఏప్రిల్ 20వ తేదీన విచారణకు రావాలి అని ఫ్యామిలీ కోర్టు విజయ్ కి నోటీసులు కూడా పంపించిన విషయం తెలిసిందే.
దీంతో విజయ్ – త్రిష మధ్య ఏదో ఉందనే రూమర్లు వినిపిస్తున్నా.. అటు రాజకీయ నాయకులు కూడా ప్రస్తావిస్తున్నా వీరిద్దరూ స్పందించడం లేదు. పైగా కలసి పబ్లిక్ లో తిరుగుతూ అనుమానాలను మరింత బలపరుస్తున్నారు.
ఇలాంటి సమయంలో.. తాను కూడా తన భర్త విషయంలో వేరొక అమ్మాయి కారణంగా తన భర్తకు దూరం అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆ సమయంలో తనకెందుకు అండగా నిలవలేదు అంటూ ప్రశ్నించింది ఒక స్టార్ హీరో భార్య. మరి ఆమె ఎవరు ? అసలేం చెప్పింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఆమె ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) మాజీ భార్య ఆర్తి (Aarti). సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది..
ముఖ్యంగా విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు రావడం.. మరోవైపు త్రిషతో కలిసి బహిరంగంగా కనిపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే దీనిపై ఆర్తి స్పందిస్తూ.. “ఒక భార్య గౌరవం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతుండడం చూస్తుంటే.. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి బంధం అందరి ముందు విడిపోతుంటే ఆ సమయంలో ఆ మహిళ పడే వేదన, అవమానం గురించి చర్చించడం మంచిదే. కానీ గత ఏడాది నా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు.. ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు” అంటూ ప్రశ్నించింది ఆర్తి. తన పోస్టులో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆమె ఈ సమయంలో మాట్లాడిన మాటలు త్రిష – విజయ్ – సంగీతల గురించి ప్రస్తావించింది అని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:UBS OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఎప్పుడు ?ఎక్కడంటే?
“ముఖ్యంగా భార్యపై చూపే జాలి అనేది సదరు వ్యక్తికి ఉన్న మార్కెట్ విలువను బట్టి మారుతుందా? లేక సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఆమె బాధను గుర్తిస్తారా? ఏ భార్య కూడా ఇలాంటి అవమానాన్ని నిశ్శబ్దంగా అసలు భరించకూడదు.. సానుభూతి అనేది కేవలం మార్కెట్ ఉన్న వారికి మాత్రమే పరిమితం కాకూడదు” అంటూ తన పోస్ట్ ద్వారా వెల్లడించింది ఆర్తి. ఇకపోతే తన భర్త రవి మోహన్ ప్రముఖ సింగర్ కెనీషాతో కలిసి ఒక వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు తనపై లేనిపోని అపనిందలు వేశారని, ఇప్పుడు విజయ్ విషయంలో మాత్రం అందరూ ఆయన భార్య వైపు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఆర్తి చేసిన పోస్ట్ కు ఇప్పుడు నెటిజన్ల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. ఇకపోతే రవి మోహన్ 2024లో తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కెనీషాతో కలిసి గోవాలో ఒక బంగ్లాను కొనుగోలు చేయగా.. దాని రిజిస్ట్రేషన్ సమయంలో తనను తాను అవివాహితుడిగా పేర్కొన్నారు.