E-Paper
Advertisement

Naga Vamsi: జననాయగన్ రైట్స్ కొనుక్కుంటున్న వంశీ, రాజా సాబ్ కి ఎదురు వెళ్తున్నాడా?

Naga Vamsi: జననాయగన్ రైట్స్ కొనుక్కుంటున్న వంశీ, రాజా సాబ్ కి ఎదురు వెళ్తున్నాడా?
Advertisement

Naga Vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో నాగవంశీ ఒకరు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలు చేస్తూ ఉంటారు. వేరే దర్శకుడు ఆ బ్యానర్ అసలు సినిమాలు చేయరు. ఇతర దర్శకులతో చేయడానికి అనుకూలంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించారు. వాస్తవానికి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఒక బ్రాండ్. అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి.

జెర్సీ, సార్, లక్కీ భాస్కర్, మ్యాడ్ వంటి సినిమాలు ఈ బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ రావడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా చూసినా 2025 మాత్రం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు కలిసి రాలేదు అని చెప్పాలి. డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు వర్కౌట్ కాలేదు, నిర్మించిన సినిమాలో కూడా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు.

జననాయగన్ రైట్స్ 

Advertisement

హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న సినిమా జననాయగన్. విజయ్ నటిస్తున్న చివరి సినిమా ఇది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చేసాడు. అయితే ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని వార్తలు కూడా వినిపించాయి. రీసెంట్ గా విడుదలైన పాటలు ఒరిజినల్ సినిమాకి సంబంధించిన కొన్ని మార్క్స్ కూడా కనిపించాయి. అలానే కేవలం దర్శకుడుగా మాత్రమే హెచ్ వినోద్ పేరు వేసుకోవడం అనేది రీమేక్ అనే వార్తలకు కొంచెం బలం చేకూర్చింది.

ఈ సినిమా జనవరి తొమ్మిది న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన తెలుగు డిస్ట్రిబ్యూషన్ తొమ్మిది కోట్లకు నాగ వంశీ తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రిఫండ్బుల్ బైసిస్ తో ఈ సినిమా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

రాజా సాబ్ కు ఎదురు 

Advertisement

సంక్రాంతి కానుకగా జనవరి 9న మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా లేట్ అవుతుంది అని కొన్నిసార్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా డిలే అయ్యే అవకాశం లేదు చెప్పిన డేట్ కి వస్తుంది అని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన ఇచ్చారు.

అదే రోజున విజయ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిని బట్టి రాజా సాబ్ సినిమాకు పోటీగా నాగవంశీ వెళ్తున్నాడా అని డిస్కషన్స్ మొదలయ్యాయి. అయితే 2025 సంవత్సరం అసలు నాగ వంశీకి కలిసి రాలేదు. హిందీ సినిమా వార్ విపరీతమైన నష్టాలు తీసుకొచ్చింది. సంక్రాంతికి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి కూడా అనగనగా ఒక రాజు సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు వంశీ. ఇక 2026 ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి.

Also Read : The Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రాకపోవటానికి కారణం అదే, అనవసరంగా తమన్ తప్పుపట్టాం

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×