E-Paper
Advertisement

పండగ వేళ పిచ్చెక్కించే ఆఫర్లు.. శాంసంగ్ ప్రొడక్ట్స్‌పై ఎంత ఆదా చేయవచ్చంటే?

పండగ వేళ పిచ్చెక్కించే ఆఫర్లు.. శాంసంగ్ ప్రొడక్ట్స్‌పై ఎంత ఆదా చేయవచ్చంటే?
Advertisement

Amazon Great Indian Festival 2026: యాపిల్, శాంసంగ్ లాంటి బ్రాండ్ల నుంచి మంచి ప్రొడక్ట్స్ కొనాలని చాలామంది అనుకుంటుంటారు. దీని కోసం ఏదైనా పండగ సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే.. ఆ సమయంలో డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లు లభిస్తాయని. అలాంటి వారికి ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 ఇప్పటికే ప్రారంభమై ధూమ్ ధామ్‌గా సాగుతోంది. ఈ ఏడాది సేల్‌లో శాంసంగ్ తమ పాపులర్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలతో పాటు గృహోపకరణాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ఫోన్ల నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు అన్నింటిపైనా వేల రూపాయల డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళ్లిపోదా రండి..

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు..

తక్కువలో కొత్త ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఈ సేల్ మంచి అవకాశం అనే చెప్పాలి. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ S25 అల్ట్రా అసలు ధర రూ.1,29,999 ఉండగా, ఆఫర్‌లో రూ.94,999కే లభిస్తోంది. అలాగే మిడ్‌రేంజ్ విభాగంలో గెలాక్సీ A56 5G ఫోన్ రూ.49,999 నుంచి తగ్గించబడి రూ.31,999 ధరకే అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటు గెలాక్సీ M47 5G రూ.26,999కి, గెలాక్సీ M17 5G రూ.19,999కి, అలాగే ఎంట్రీ లెవెల్ మోడల్ గెలాక్సీ M17e 5G కేవలం రూ.16,998 లభించడం విశేషం.

Advertisement

Also Read: ల్యాప్‌టాప్ ఛార్జింగ్ 80% దగ్గరే ఆగిపోతుందా? బ్యాటరీ పాడైపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే!

ట్యాబ్లెట్స్, టీవీలు..

పెద్ద స్క్రీన్ ఆనందాన్ని ఇచ్చే ట్యాబ్లెట్ల విభాగంలో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్‌పై బంపర్ డిస్కౌంట్ వచ్చింది. దీని అసలు ధర రూ.57,999 కాగా, సేల్‌లో రూ.30,999కే దక్కుతోంది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టీవీలు కొనేవారికి కూడా మంచి ఛాయిస్ ఉంది. శాంసంగ్ 65 ఇంచుల క్రిస్టల్ UHD 4K విజన్ AI 2026 స్మార్ట్ టీవీ రూ.54,990కి, 43 ఇంచుల FHD స్మార్ట్ టీవీ రూ.29,490కి లభిస్తుండగా.. 32 ఇంచుల HD స్మార్ట్ టీవీని రూ.14,490కే సొంతం చేసుకోవచ్చు.

గృహోపకరణాలపై బంపర్ డిస్కౌంట్లు..

Advertisement

కేవలం గ్యాడ్జెట్లు మాత్రమే కాకుండా ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్స్‌పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ 7 కేజీ 5-స్టార్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ రూ.25,990కి బదులుగా రూ.16,990కే లభిస్తోంది. అలాగే బ్యాచిలర్స్ లేదా చిన్న కుటుంబాలకు సరిపోయే శాంసంగ్ 189 లీటర్ల 5-స్టార్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్‌ను రూ.23,999 అసలు ధరకు బదులు ఆఫర్‌లో రూ.17,990కే సొంతం చేసుకోవచ్చు.

నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లు..

కస్టమర్లకు మరింత ఆదా ఇచ్చేందుకు అమెజాన్ అదనపు బ్యాంక్ ఆఫర్లను ఇస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ వాడేవారికి అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇవే కాకుండా నో-కాస్ట్ ఈఎంఐ, కూపన్ డిస్కౌంట్లు, అమెజాన్ పే లేటర్ సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి.. ప్రొడక్ట్ పేజీలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఫైనల్ ప్రైస్ చూసుకుని ఆర్డర్ చేసుకోండి.

Also Read: వాట్సప్‌లో ఇప్పటివరకు రాని క్రేజీ ఫీచర్.. ఇది తెలిస్తే గాల్లో తేలిపోతారు!

Tags

Related News

యూట్యూబ్ లేటెస్ట్ అప్‌డేట్..మొబైల్ ఫోన్లలో ఏఐ ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్ లాంచ్!

ఇకపై అనౌన్ కాల్స్ ఉండవు.. ఫోన్‌లో కాలర్ అసలు పేరు చూపే CNAP సేవలు ప్రారంభం!

రియల్‌మీ నుంచి అద్భుతమైన మినీ ఫ్రిజ్..రూ.8,490కే!

జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఒక్క రీఛార్జ్‌తో మరో నెల ఉచితం.. అర్హులు ఎవరో తెలుసా?

కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా? ఈ BLDC ఫ్యాన్లు వాడితే బెస్ట్

రూ.50వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు..బ్యాంక్ ఆఫర్లో బ్రాండెడ్ మోడల్స్!

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ 80% దగ్గరే ఆగిపోతుందా? బ్యాటరీ పాడైపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే!

Big Stories

Advertisement
×