M.S.Subbulakshmi: తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ సినిమాగా విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సెప్టెంబర్ లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా “భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లభించాయి. “భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” సినిమా తెరకెక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమా మరో శంకరాభరణం అవుతుందని రజనీకాంత్ రీసెంట్ గా జరిగిన జైలర్ 2 సినిమా ఈవెంట్ లో చెప్పారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను స్క్రీన్ మీద చూసేందుకు తాను వేచి చూస్తున్నట్లు రజనీకాంత్ తెలిపారు.
నిజానికి భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ను అనుకున్నప్పుడు మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవి (Sai Pallavi), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) వంటి వారి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ స్క్రీన్ టెస్ట్ చేశాక రష్మిక మందన్న (Rashmika mandanna) సుబ్బులక్ష్మి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోవడంతో ఈమెను ఫైనల్ చేశారు. ఇక జెర్సీ కింగ్డమ్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతం తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. గీత ఆర్ట్స్, రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ల కింద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ALSO READ: నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!
ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకొని ఈ సినిమా భారీ పూజ, టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 2026 సెప్టెంబర్ 16 చెన్నైలోని ప్రతిష్టాత్మక మ్యూజిక్ అకాడమీలో జరిగింది. లోక నాయకుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా తొలి షాట్ కి లాంచనంగా క్లాప్ బోర్డు కొట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుబ్బులక్ష్మి కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ ప్రముఖులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు కూడా హాజరయ్యారు. ఇకపోతే ఈ సినిమా ప్రారంభోత్సవం తర్వాత రష్మిక మందన్న , చిత్ర బృందం సుబ్బులక్ష్మి కుటుంబ సభ్యులను కలుసుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.