Queen Glimpse: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ (Social Media Influencer Yamini ER) హీరోయిన్‌గా పరిచయం చేస్తూ.. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి రూపొందిస్తున్న మూడో చిత్రానికి ‘క్వీన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇంతకు ముందు రతన్ రిషి (Rathan Rishi) తెరకెక్కించిన ‘ఉత్తర’, ‘ఆర్టిస్ట్’ చిత్రాలు మంచి ఫిలింమేకర్‌గా ఆయనకు పేరును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రతన్ రిషి.. ఈసారి తన మూడో చిత్రంగా హీరోయిన్ సెంట్రిక్ కథతో ‘క్వీన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తుండగా.. కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90స్ హీరోల్లోని ఒకరిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ చూస్తే.. ప్రస్తుత సోసైటీతో ముడిపడి ఉన్న ఆసక్తికర ప్రేమ కథా చిత్రమిదని అర్థమవుతోంది.
‘క్వీన్’ టైటిల్ గ్లింప్స్ (Queen Glimpse)ను గమనిస్తే.. ‘రాళ్ల మీద పేర్లతో మిగిలిపోయిన ప్రేమ కథలు కొన్ని, తాజ్ మహల్ గుర్తులుగా వెలిగిపోయిన కథలు కొన్ని, కానీ.. ఈసారి మనుగడను మార్చే దారిలో, కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ’ అనే లేడీ వాయిస్‌తో ఈ గ్లింప్స్ మొదలైంది. భారత రాజ్యాంగం, ఆర్‌టీఐ యాక్ట్, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ సిస్టమ్, యాక్ట్ ఆఫ్ లవ్ వంటివన్నీ ‘క్వీన్’ సినిమా టైటిల్ గ్లింప్స్‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా, అక్కడ ఉన్న జనం ‘న్యాయానికి సంకెళ్లు వేయోద్దు వేయోద్దు’ అంటూ నినాదాలు చేస్తున్నారు. హీరోయిన్ ఫేస్ చూపించలేదు కానీ, విలన్‌గా ‘కాలకేయ’ ప్రభాకర్ ఓ క్రూసియల్ రోల్ ఇందులో పోషించినట్లుగా చూపించారు. అజయ్ ఘోష్ పాత్రని కూడా పరిచయం చేశారు. ఎవరైతే ప్రేమలోని నిజమైన ముఖాన్ని చూపిస్తారో.. అలాంటి రియల్ లవర్స్ అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లుగా ఈ గ్లింప్స్‌లో మేకర్స్ తెలియజేశారు.
సింపుల్‌గా చెప్పాలంటే.. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ.. అతని కలకు చట్టబద్ధమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసిందనేదే ఈ చిత్ర కథ అని మేకర్స్ చెబుతున్నారు. అందరికీ స్ఫూర్తి కలిగించేలా, అందరిలో స్ఫూర్తి నింపేలా దర్శకుడు రతన్ రిషి చేసిన ఈ ప్రయత్నం, కచ్చితంగా సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. యతీష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజుల్లో రియల్ లవ్ దొరకడం ఎంత కష్టమో తెలియంది కాదు. అలాంటి ఓ రియల్ ప్రేమకథని ఇందులో చూపించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా.. ఈ గ్లింప్స్ తెలియజేస్తుంది. మరి ఈ రియల్ ప్రయత్నాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో తెలియాలంటే మాత్రం కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే.