E-Paper
Advertisement

చిరంజీవితో మల్టీస్టారర్.. కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున!

చిరంజీవితో మల్టీస్టారర్.. కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున!
Advertisement

Nagarjuna -Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు సందడి చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి(Chiranjeevi) నాగార్జున(Nagarjuna) కలిసి ఒకే సినిమాలో చేస్తే చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.

చిరంజీవితో నాగ్ మల్టీస్టారర్..

ఇలా వీరిద్దరి మల్టీ స్టార్ సినిమా గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా కింగ్ నాగార్జున చిరంజీవితో మల్టీ స్టార్ సినిమా చేయడం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగార్జున ఇట్లు అర్జున(Itlu Arjuna) ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరుల నుంచి చిరంజీవితో మల్టీ స్టారర్ సినిమా చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చిరంజీవి గారితో ఎప్పుడు కలిసిన మీరు సినిమా చేస్తామని చెబుతున్నారు మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటూ ప్రశ్న ఎదురయింది.

దేనికైనా సమయం రావాలి..

Advertisement

ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ.. నేను కూడా చిరంజీవితో సినిమా చేయడం కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఎక్కడ కలిసిన ఇద్దరం కలిసి సినిమా చేయడం గురించే మాట్లాడుకుంటాం.. అయితే మా ఇద్దరికీ సరిపడా కథ రావాలి అంటే కాస్త సమయం పడుతుందని ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని నాగార్జున తెలిపారు. చిరంజీవి గారితో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయటం గురించి ఈ సందర్భంగా నాగార్జున తెలియజేశారు. మరి ఇద్దరి హీరోలకు సరిపడే కథ ఏ డైరెక్టర్ అందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

నాగార్జున కింగ్ 100..

నాగార్జున చిరంజీవి కాంబినేషన్లో సినిమా వస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మారుతుందని చెప్పాలి. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం తన 158 వ సినిమా కాకా(Kaaka) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. మరోవైపు నాగార్జున కింగ్ 100 (King 100)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నాగార్జున కెరియర్ 100వ సినిమా కావడంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. డిసెంబర్ 24వ తేదీ ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Also Read: రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?

Related News

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?

రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?

మంగ్లీ ఎలాంటిది అంటే .. చరణ్ అర్జున్ ఎమోషనల్ కామెంట్స్

రిలీజ్ డేట్ చెప్పి వాయిదా వేస్తే ఎలా?ఆదర్శ కుటుంబం పై నాగార్జున కామెంట్స్!

వీకే నరేష్ విగ్గు ధర ఎంతో తెలుసా? ఒక ఫ్యామిలీ లగ్జరీగా బ్రతకొచ్చుగా?

Big Stories

Advertisement
×