E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!
Advertisement

Android Earthquake Alerts: భూమి కంపిచే క్షణానికి ముందే మీ చేతిలోని ఫోన్ మోగితే? ప్రమాదం ముంచుకొచ్చే కొన్ని సెకన్ల ముందే ‘జాగ్రత్త’ అని హెచ్చరిస్తే? అవును.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ప్రాణాలు కాపాడేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ఒక విప్లవాత్మక అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం 98 ప్రాంతాలకే పరిమితమైన తమ ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్’ (Android Earthquake Alerts) సేవలను, ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలు, ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు గూగుల్ అధికారికంగా ప్రకటించింది.

ఫోన్ ద్వారా ముందస్తు హెచ్చరికలు..

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే మోషన్ సెన్సార్లు భూకంప ప్రకంపనాలను సులభంగా పసిగడతాయి. ఒకే ప్రాంతంలో ఉన్న చాలా ఫోన్లు ఒకే సమయంలో ప్రకంపనలకు గురైనప్పుడు గూగుల్ సిస్టమ్ దానిని గుర్తిస్తుంది. వెంటనే అది భూకంపం అని నిర్ధారించుకుని ఆ చుట్టుపక్కల ప్రజలకు హెచ్చరికలు పంపుతుంది. భూకంప తీవ్రతను బట్టి Be aware, be ready, take action అనే మూడు రకాల అలర్టులు వస్తాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే పూర్తి స్క్రీన్ మీద రక్షణ చర్యలు కనిపిస్తాయి.

Advertisement

Also Read: యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

రాబోయే రోజుల్లో సరికొత్త అప్‌డేట్స్..

త్వరలోనే ఈ అలర్ట్ సిస్టమ్‌ను మరింత ఉపయోగకరంగా మార్చనున్నారు. రాబోయే నెలల్లో బీ రెడీ అలర్ట్‌తో పాటు భూకంపం ఎక్కడ రాబోతోందో తెలిపే మ్యాప్, దాని తీవ్రత వివరాలు కూడా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అంతేకాకుండా.. సమాచారం తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక బటన్ కూడా ఇస్తారు. ఇటీవల వెనిజులాలో జరిగిన భూకంపంలో అనేకమందికి ప్రకంపనాలు రాకముందే ఈ హెచ్చరికలు అందడం విశేషం. ఈ అదనపు వివరాలు ప్రజలకు మరింత ధైర్యాన్ని, స్పష్టతను ఇస్తాయి.

ఆ కొద్ది సెకన్లు ఎంతో కీలకం..

Advertisement

ఈ అలర్టులు మనకు కొన్ని సెకన్ల సమయాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ ఆ కొద్ది సెకన్లే మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో కీలకం. కిందకు వంగడం, ఏదైనా బలమైన టేబుల్ కింద దాక్కోవడం లేదా సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి ఆ సమయం సరిపోతుంది. అయితే మన ప్రదేశం, భూకంప వేగాన్ని బట్టి హెచ్చరికలు వచ్చే సమయం కాస్త మారవచ్చు. ప్రభుత్వాలు ఇచ్చే అధికారిక సమాచారంతో పాటు ఈ సాంకేతికత ఒక అదనపు రక్షణగా ఉపయోగపడుతుంది.

అత్యవసర ప్రణాళికలు చాలా ముఖ్యం..

సాంకేతికత ఎంత పెరిగినా మన ముందుజాగ్రత్తే అత్యంత ముఖ్యమైనది. గూగుల్ పంపే హెచ్చరికలు మనకు సహాయపడతాయి కానీ, పూర్తిగా వాటిపైనే ఆధారపడకూడదు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో అత్యవసర సమయాల్లో ఏం చేయాలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. స్థానిక భద్రతా నిబంధనలను పాటించడం, సురక్షిత ప్రాంతాలను ముందే గుర్తించి ఉంచుకోవడం మంచిది. ఫోన్ అలర్ట్ ఒక మంచి రక్షణ సాధనం, కానీ మన అప్రమత్తతే అసలైన రక్షణ అని గుర్తుంచుకోవాలి.

Also Read: యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

Tags

Related News

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×