E-Paper
Advertisement

రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?

రణబాలి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదా? ఎవరంటే?
Advertisement

Ranabaali Movie: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన రణబాలి సినిమా (Ranabaali)నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ నటనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా విజయ్ దేవరకొండ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి హిట్ అందుకున్నారని చెప్పాలి. ఇలా విజయ్ రణబాలి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రణబాలి కోసం రామ్ చరణ్..

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించినప్పటికీ డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండ కాదు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్ రాహుల్ మదిలో మొదట రామ్ చరణ్ (Ramcharan) పేరు గుర్తుకు వచ్చిందట. అయితే ఈ సినిమా కథ రామ్ చరణ్ కంటే కూడా విజయ్ దేవరకొండకు అద్భుతంగా సూట్ అవుతుందని భావించిన రాహుల్ సాంకృత్యన్( Rahul Sankrityn) విజయ్ దేవరకొండ కోసమే ఈ కథ రాసారని తెలుస్తోంది.

రామ్ చరణ్ చేయకపోవడమే మంచిదైందా..

Advertisement

ఇలా రణబాలి సినిమా కథకు డైరెక్టర్ రామ్ చరణ్ అనుకున్నారంటూ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ చేయకపోవడమే మంచిదయింది ఈ కథ విజయ్ దేవరకొండకు సరిగ్గా సూట్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఇలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇదివరకు పలు సినిమాలలో నటించారు. ఇదే కథతో రామ్ చరణ్ సినిమా చేసి ఉంటే రొటీన్ అనిపించేదని , చరణ్ చేయకపోవడమే మంచిది అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ..

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు రాయలసీమలో ఏర్పడిన కరువు , బ్రిటిష్ వారు సీమ ప్రజలను హింసిస్తున్నటువంటి హింసల పై ఎదురు దాడి చేసే ఒక యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత విజయ్ రష్మిక ఈ సినిమా ద్వారా జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సూపర్ హిట్ అందుకున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా నిరాశలో ఉన్న అభిమానులకు రణబాలి మంచి సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి.

Advertisement

Also Read: రిలీజ్ డేట్ చెప్పి వాయిదా వేస్తే ఎలా?ఆదర్శ కుటుంబం పై నాగార్జున కామెంట్స్!

Related News

మంగ్లీ ఎలాంటిది అంటే .. చరణ్ అర్జున్ ఎమోషనల్ కామెంట్స్

రిలీజ్ డేట్ చెప్పి వాయిదా వేస్తే ఎలా?ఆదర్శ కుటుంబం పై నాగార్జున కామెంట్స్!

వీకే నరేష్ విగ్గు ధర ఎంతో తెలుసా? ఒక ఫ్యామిలీ లగ్జరీగా బ్రతకొచ్చుగా?

పాటలకు లక్షల్లో వ్యూస్.. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ..చరణ్ అర్జున్ ఆవేదన!

రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..ఎప్పుడు? ఎక్కడంటే?

జైలర్ 2లో హృతిక్ రోషన్.. 5 నిమిషాలకే అన్ని కోట్లా?

నా కోరిక నెరవేరలేదు.. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పై విద్యాబాలన్ కామెంట్స్!

Big Stories

Advertisement
×