E-Paper
Advertisement

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!
Advertisement

Lenin Blockbuster Event: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. అఖిల్ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్ అక్కినేని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. సరైన బ్లాక్ బస్టర్ సక్సెస్ లభించలేదు. ఇక ఇన్నేళ్లుగా మంచి విజయం కోసం ఎదురుచూసిన అఖిల్.. ఎట్టకేలకు లెనిన్ మూవీతో ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నేడు గ్రాండ్ గా లెనిన్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ నిర్వహించారు.

ఘనంగా లెనిన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున.. తన కొడుకు అఖిల్ అందుకున్న విజయానికి, అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుడైపోయి కన్నీటి పర్యంతమవుతూ.. భావోద్వేగ ప్రసంగం ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు.. లెనిన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో ముందుగా నాగార్జున నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. నాగచైతన్య నా గురించి ఎంతో ప్రేమగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు.. ఈ సక్సెస్ కేవలం ఒక్క సినిమాకే పరిమితం కాదు.. మొత్తం చిత్ర బృందానికి దక్కిన గౌరవం. సినిమా సక్సెస్ ను పంచుకునేందుకు ఎగ్జిబిటర్లను, డిస్ట్రిబ్యూటర్లను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి సత్కరించడం చాలా ఏళ్ల తర్వాత జరుగుతోంది. అలాంటి వేడుక ఇప్పుడు మళ్లీ జరగడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి డిస్ట్రిబ్యూటర్లు హౌస్ ఫుల్ షోలు,అదనపు షోలు పెరుగుతున్నాయని చెప్పడం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది” అంటూ నాగార్జున తెలిపారు.

Advertisement

also read:బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

లెనిన్ టీంపై నాగార్జున ప్రశంసలు..

ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిపై కూడా ఆయన ప్రత్యేకంగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా రూపుదిద్దుకోవడంలో రచయిత సత్యానంద్ చేసిన సహకారం విలువైంది. కథ విన్న తర్వాత దర్శకుడిని ఆయన వద్దకు పంపించాను. స్క్రిప్టును మరింత బలంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు అంటూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు నాగార్జున.

అఖిల్ గురించి మాట్లాడుతూ నాగార్జున కన్నీళ్లు..

Advertisement

ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానుల నుంచి వినిపిస్తున్న అరుపులు , చప్పట్ల కోసం అఖిల్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాడు. ఇప్పుడు ప్రేక్షకుల ప్రేమను చూసి మా ఇంట్లో నిజంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ విజయాన్ని మా కుటుంబం ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది” అంటూ సక్సెస్ కోసం అఖిల్ పడ్డ కష్టాన్ని, ఎదురుచూపును వివరిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు నాగార్జున. మొత్తానికి అయితే అఖిల్ దాదాపు దశాబ్ద కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూసి ఎట్టకేలకు లెనిన్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. నాగార్జున కూడా తన కొడుకు కెరియర్ లో తొలిసారి బ్లాక్ బస్టర్ లభించడంతో పుత్రోత్సాహంతో వేదికపై కన్నీటి పర్యంతం అవుతూ అభిమానులను ఆశ్చర్యపరిచారు.ప్రస్తుతం నాగార్జున ఇచ్చిన ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×