E-Paper
Advertisement

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?
Advertisement

Tollywood Delays:ఒడిస్సీ’ ..నోలన్ దర్శకత్వంలో వచ్చిన భారీ విజువల్ ఫీస్ట్.ఇక ఈ సినిమాని సరిగ్గా జులై 17 2026లో రిలీజ్ చేస్తామని ఏడాది ముందరే అనౌన్స్ చేశారు మేకర్స్,ఇక సినిమా కూడా అన్నట్టుగానే రిలీజ్ అయింది కూడా.అయితే ఎప్పుడో ఏడాది ముందే డెడ్‌లైన్ ఫిక్స్ చేసుకుని, చెప్పిన రోజే పక్కాగా థియేటర్లలోకి వచ్చేస్తుంటే మనం మాత్రం ఎందుకిలా నెల ముందు చెప్పిన డేట్స్ కి కూడా రిలీజ్ చేయలేకపోతున్నాం, అసలు టాలీవుడ్ లో ఈ పరిస్థితి ఎందుకుంది అంటూ ప్రశ్న ని లేవనెత్తాడు నాగ్.

తాజాగా లెనిన్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ నిన్నే పెళ్లాడుతా’, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలని రిలీజ్‌కి నెల రోజుల ముందే చూసుకునే వాళ్ళమని, అలాంటిది, ఇపుడు నేను చెప్పినట్టుగా జూన్ 25న కూడా లెనిన్ ని థియేటర్ లలోకి తేలేకపోయానని,సినిమా పూర్తిగా కంప్లీట్ అయినా కూడా టెక్నికల్ గా వర్క్ కంప్లీట్ చేయలేకపోయామని వాపోయాడు.

Advertisement

కథా కాకరకాయ …సినిమా డేట్స్ పట్టేస్తే చాలు

నిజానికి ఈ సినిమాకే కాదు, గత కొంతకాలంగా టాలీవుడ్ లో వస్తున్న ఏ సినిమాలు చెప్పిన సమయానికి విడుదల కావట్లేదన్నది వాస్తవం.అసలు ఎందుకు రిలీజ్ కావట్లేదు,రిలీజ్ కావట్లేదు అంటూ బయటికి అంటున్నారు కాని ఆ రిలీజ్ కాకపోవడం వెనుకున్న సమస్య నాగ్ కి తెలీంది ఏమీ కాదు.

Advertisement

కథా కాకరకాయ …సినిమా డేట్స్ పట్టేస్తే చాలు అన్న మెంటాలిటీలో ఉండే మన మేకర్స్ వేసిన షెడ్యూల్ లో సినిమాని కంప్లీట్ చేయరన్నది అందరికి తెల్సిందే.పైగా ఒకే సారి పదుల సినిమాలకి సైన్లు పెట్టాలనుకునే హీరోయిన్లు, ప్లానింగ్ లేకముందే సినిమాల్లోకి దూకేసే నిర్మాత, అసలేం తీస్తున్నామో, ఎంత తీస్తున్నామో తెలీకుండా తీసే డైరక్టర్లు,ఇచ్చిన డేట్స్ తప్ప ఇంకెప్పుడైనా చేసుకోండి అనే హీరోలు …ఇలా ఒకటి కాదు కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్టుగా ఒక సినిమా మొదలై రిలీజ్ అయ్యేవరకు అసలెంత వరకు వెళ్తుందో తెలీకుండా, ముందుకు ముందుకు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం, తీరా అబ్బే ఇప్పుడు రావట్లేదు అని వాయిదాల పాట పాడటం ఇక్కడ కొత్తేమీ కాదు.

నక్కకి, నాగ లోకానికి ఉన్నంత తేడా

సినిమా తప్ప మరేమీ ఆలోచించని వారికి, సినిమా తప్ప అన్నీ ఆలోచించే మనకి నక్కకి, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్న సంగతి తెలీకుండానే నాగ్ ఈ స్టేజి వచ్చాడని చెప్పలేము.గతంలో చిన్న సినిమాలు కాదు, ఇప్పుడంతా ఫ్యాన్ ఇండియా రేంజ్ అంటూ సమర్ధించుకోవచ్చు కాని, ఆ ఫ్యాన్ ఇండియా సినిమాలు కూడా ఎన్ని బోల్తా పడ్డాయో బాక్సాఫీస్ చూస్తేనే తెలుస్తుంది.

also read :నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

హాలీవుడ్‌లో ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లకముందే ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్, ఎడిటింగ్ టైమ్‌లైన్స్ అన్నీ ముందే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు అక్కడి మేకర్స్ ,కాని ఇక్కడ రేపు ఉదయం ఫస్ట్ డే ఫస్ట్ షో అనగా, ఈ రోజు అర్ధరాత్రి వరకు ఎడిట్ రూమ్‌లో కూర్చుని సీన్లు ఎడిట్ చేయడం, కలర్ కరెక్షన్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాచ్‌వర్క్‌లు అంటూ తెల్లార్లు సినిమాలపై పని చేస్తూనే ఉంటారు.ఏమైనా అంటే పర్ఫెక్షన్ అని కలరింగ్ ఇస్తుంటారు.స్క్రిప్ట్ పక్కాగా ఉంటె రిలీజ్ డేట్ వరకు కూడా ఇంకా సినిమాపై ఎడిట్ రూమ్ లో గంటలు గంటలు ఎందుకు కూర్చోవస్తుందో మేకర్సే ఆలోచించాలి.

ఏది ఏమైనా ‘ఒడిస్సీ’లా మనమెందుకు రాలేకపోతున్నాం అని నాగ్ అడగడం బాగానే ఉంది కాని ,అన్నీ తెల్సిన నాగ్ అడగడమే కాస్త కామెడీగా ఉంది !

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×