E-Paper
Advertisement

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?
Advertisement

Namitha Transformation: నమిత..తెలుసునా తెలుసునా అంటూ సొంతం సినిమాలో తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత’జెమిని’,బిల్లా’ వంటి సినిమాల్లో తళుక్కుమన్న సంగతి తెల్సిందే. అయితే ఆ తర్వాత వచ్చిన సింహ వంటి సినిమాలలో బొద్దుగా కనిపించడం మొదలెట్టింది.అయితే బొద్దుగా ఉండి అలసిపోయిందా లేక అవకాశాలు రావట్లేదని ఫిక్స్ అయిందా తెలీదు కాని ఇపుడు మళ్ళీ జిమ్ లో చెమటలు చిందిస్తుంది.ఆక్రమంలోనే తాజగా తన ఇన్స్టా లో వదిలిన ఒక చిన్న వీడియో బైట్ చూసి షాక్ అవుతున్నారు మూవీ లవర్స్.

ఇప్పటి హీరోయిన్స్ కి గట్టిగానే కాంపిటీషన్

Advertisement

నిజానికి 2017లో బిజినెస్‌మ్యాన్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడి, ఆ తర్వాత 2022లో 41 ఏళ్ల వయసులో కవల పిల్లలకి జన్మనిచ్చిన నమిత ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందని అనుకున్నారంతా, ఈక్రమంలో వేరే సినిమాలు కూడా ఒప్పుకోకపోవడం తో అదే అని ఫిక్స్ అయ్యారు కూడా.కాని ఊహించని విధంగా జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ఒక మిర్రర్ సెల్ఫీ వీడియో వదిలడంతో ఒక్కసారిగా ఆడియన్స్ కి పెద్ద షాకే తగిలింది. గ్రే కలర్ క్రాప్ టాప్, డార్క్ గ్రే టైట్స్ వేసుకున్న నమితని చూస్తుంటే ఇప్పటి హీరోయిన్స్ కి గట్టిగానే కాంపిటీషన్ ఇచ్చేలానే ఉందే అంటూ కామెంట్స్ వదులుతున్నారు నెటిజన్లు.ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లేటెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ హాట్ టాపిక్‌గా మారింది.

also read :రంగస్థలం కాంబో రిపీట్..చరణ్-సుకుమార్ ‘#RC17’ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా ?

Advertisement

వావ్.. సూపర్.. గ్రేట్ ఇన్స్పిరేషన్”

ఇక ఈ విజువల్స్ చూసి కొందరు “వావ్.. సూపర్.. గ్రేట్ ఇన్స్పిరేషన్” అంటూ నమితని ఆకాశానికి ఎత్తేస్తుంటే పాత రోజులను గుర్తుచేసుకునే హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఈ మార్పును అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికన్నా మునుపటి బొద్దుగా ఉన్న నమితనే బాగుంది, ఈ స్లిమ్ లుక్స్‌ని మేం భరించలేం!” అంటూ తెగ బాధపడిపోతున్నారు.ఇక మరికొందరైతే
“నువ్వు కూడా ఇలా జీరో సైజ్‌కి మారిపోతే.. ఎలా సోషల్ మీడియాలో తెగ ఫీలవుతున్నారు.

ఏకంగా గుడి నిర్మించిన అభిమానులు 

ఇక నమిత విషయానికి వస్తే 1981  మే 10న గుజరాత్ లోని సూరత్ లో జన్మించిన నమిత పూరి పేరు నమితా ముకేశ్ వాంక్వాలా.ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ చేసిన ఈ బొద్దు గుమ్మ మిస్ సూరత్ విజేత గా నిలవడమే కాకుండా 2001 మిస్ ఇండియా పోటీలో టాప్ ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలవడం విశేషం.ఇక తెలుగులో జెమిని సొంతం, ఒక రాజు ఒక రాణి, దేశానికి ఒక్కడు, ఇద్దరు మొనగాళ్లు వంటి సినిమాలతో పాటు తమిళంలో విజయ్, అజిత్, శరత్‌కుమార్, సత్యరాజ్ వంటి స్టార్ హీరోలతో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.ఇక 2017 నవంబర్ 24న వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని తిరుపతిలో వివాహం చేసుకున్న నమిత 2022లో కవల కుమారులకు జన్మనిచ్చిన సంగతి తెల్సిందే.

ఇక రాజకీయాల విషయానికి వస్తే మొదట AIADMKలో చేరి తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరి తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పదవిని నిర్వహించిన నమితకి తమిళనాడులో ఆమెకు అభిమానులు ఏకంగా గుడి నిర్మించడం విశేషం.

ఏదేమైనా, ఒకప్పుడు తన సైజ్‌తో థియేటర్ల సీట్లను కదిలించిన నమిత, ఇప్పుడు తన లీన్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఏమైనా గట్టి ప్లాన్ వేసిందా? లేక కేవలం ఫిట్‌నెస్ పిచ్చేనా అనేది కాలమే సమాధానం చెప్పాలి!

 

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×