E-Paper
Advertisement

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?
Advertisement

Dada Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంది. ఇక ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు గాడ్, అని దాదా అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలు అన్నింటికి తెరదించుతూ చిత్రబృందం తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు.

బుల్లెట్స్ కి బలుపు ఉండాలి.. గన్స్ కి గట్స్ ఉండాలి..

బాలకృష్ణ NBK 111 కి సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి “దాదా” (Dada)అనే పేరును ఖరారు చేస్తూ చిత్ర నిర్మాతలు తాజాగా ఒక చిన్న గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియో చూస్తుంటే మాత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఇక ఈ గ్లింప్స్ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్.. “నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్ కి బలుపు ఉండాలి, గన్స్ కు గట్స్ ఉండాలి” అంటూ చెప్పిన డైలాగ్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి ఇలా ఈ డైలాగ్ , గ్లింప్స్ చూస్తుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత మొదలవు పోతుందని చెప్పాలి. ఈ సినిమాకు దాదా అని టైటిల్ ప్రకటించడమే కాకుండా, ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్ర నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు.

క్రిస్మస్ బరిలో దాదా..

Advertisement

బాలకృష్ణ నటిస్తున్న “దాదా” సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే డైరెక్టర్ గోపిచంద్ బాలకృష్ణ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ సక్సెస్ ఆయన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం దాదా సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Advertisement

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దాదా ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాతో పాటు తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అతి త్వరలోనే ఈ సినిమా కూడా షూటింగ్ పనులను ప్రారంభం చేయబోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో తన సినిమాలో షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దాదా సినిమా షూటింగ్లో భాగంగా బాలకృష్ణ ప్రమాదానికి గురి కావడంతో ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటున్నారు అతి త్వరలోనే తిరిగి దాదా షూటింగ్లో బిజీ కాబోతున్నారు.

Also Read: అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

Related News

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!

Big Stories

Advertisement
×