E-Paper
Advertisement

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: అసభ్యకరంగా తనపై కామెంట్లు చేసిన కానిస్టేబుల్ ను డీజీపీ కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ నుంచి రిమూవ్ చేయకుండా కేసు పెట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అసలు పరీక్ష పాసయ్యే ఆయన డీజీపీ అయ్యారా? ఆయనకు చట్టం తెలుసా? అని నిలదీశారు. కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు చేపట్టకుంటే అంతర్జాతీయ వేదికల్లో ప్రభుత్వం పరువు తీస్తానని హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 356, సెక్షన్ 79, ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయో డీజీపీ చదువుకోవాలని సూచించారు. మహిళలను ఒక్క పదం అసభ్యంగా మాట్లాడిన సరే 3 ఏళ్ల పాటు శిక్ష వేసేలా చట్టాలు ఉన్నాయని అవి డీజీపీకి తెలియదా? అంటూ నిలదీశారు.

రాష్ట్రంలో క్రైమ్ రేటు..

20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉండి, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనకే రక్షణ లేకపోతే…సాధారణ మహిళలకు ఏం రక్షణ ఇస్తారని నిలదీశారు. మీకున్న ఇద్దరు కోడళ్లపై ఇలాగే కామెంట్లు చేస్తే వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో డీజీపీ బాధ్యత లేకుండా సెన్సిబులిటీ లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడున్న డీజీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్నారు. ఖమ్మం వెళ్లి స్వయంగా డీజీపీయే రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిదంటూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టాల్సిందెవరంటూ కవిత ప్రశ్నించారు. అటు హేట్ స్పీచ్ ను అరికట్టేందుకు ముఖ్యమంత్రి తీసుకొస్తామని చెప్పిన బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తేవాలని డిమాండ్ చేశారు.

అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్..

Advertisement

అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించకుండా ప్రతిపక్షం, అధికారపక్షం అడుతున్న డ్రామా అని మండిపడ్డారు. నాయకులు ఎక్కడుంటే ప్రజలకు ఎందుకు.. పీజు రీయింబర్స్ మెంట్, రైతులు, విద్యార్థులు, శాంతి భద్రతల అంశాలు చాలా ఉన్నాయి.ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండా సురేఖ అంశం అంతర్గత అంశమన్నారు. బీసీలకు 100రోజుల ఉద్యమంచేపడతామని పీసీసీ చీఫ్ మాట్లాడటం నవ్వు వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై అన్నిపార్టీలను ఢిల్లీకి తీసుకెళ్తామని దాటవేశామని, జనగణనలోనూ కేంద్రం బీసీలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.

Also read: పాకిస్తాన్ జ‌ట్టులోనూ కోటీశ్వరులు…షోయ‌బ్ అక్త‌ర్ నుంచి బాబ‌ర్ వ‌ర‌కు ఎవ‌రి ఆస్తులు ఎంతంటే ?

ఉద్యమకారులకు వాగ్దానం చేయాలి..

Advertisement

అధికారంలోకి రావటానికి తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ఉపయోగించుకుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేస్తున్నారని ,కోదండ రాం ను చూసి రేవంత్ రెడ్డిని నమ్మారన్నారు. ఉద్యమకారులు ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేశారని, ఇక వారికి ఆమరణ దీక్ష ఒక్కటే మిగిలిందన్నారు. కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు మేలు చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఉద్యమకారులకు మేలు చేసేలా నిర్ణీత కాల వ్యవధితో కూడిన వాగ్దానాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

23న కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ..

కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఫోకస్ చేశారు. ఈనెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. సభ పోస్టర్ ను ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి హాఫ్ గ్యారంటీ కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. బూటకపు హామీలు.. బోగస్ మాటల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కొడంగల్ కేంద్రంగా పాంచజన్య శంఖారావం పూరిస్తున్నామని తెలిపారు.అనంతరం బీజేపీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత ప్రభాకర్ కులకర్ణి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అర్చనా సేనాపతి, గవినోళ్ల శ్రీనివాస్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Also read: అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

Big Stories

Advertisement
×