Maheshwar Reddy: అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బిగ్ టివి తో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యార్థుల ఫీజ్ రీయంబర్స్ మెంట్, అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తాంమని హెచ్చరించారు.
సభను నడపడానికి ఈ ప్రభుత్వం భయపడుతుందని, 15 రోజుల పాటు సభని నడపాలని మేము డిమాండ్ చేస్తాంమని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రేపటి నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలని ప్రభుత్వం మోసం చేస్తున్న తీరుని అసెంబ్లీలో ఎండగడతాం అని అన్నారు.
Also read: ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్
రాష్ట్రాని దోచుకుంటున్న తీరు.. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలపై ప్రశ్నిస్తాంమని, విద్యార్థుల అవస్థలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలన పై ప్రశ్నిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలోకి రాకముందు.. వచ్చిన తరువాత చేస్తున్న వాటిని సభలో నిలదీస్తామని, 22ఏ పై ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాంమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also read: నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!