Balakrishna -Boyapati srinu: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu) బాలకృష్ణ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishan) సింహ సినిమా ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో లెజెండ్ ,అఖండ, అఖండ 2 వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.
ఇలా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలోనే ఐదో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. తాజగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఐదో సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్లో ఇదివరకు ఒప్పందం ప్రకారం బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉందట అయితే ఈ సినిమా అల్లు అర్జున్ లేదా హీరో సూర్యతో చేయాలని భావించారు కానీ వీరిద్దరితో సినిమా చేయటం కుదరని నేపథ్యంలో గీత ఆర్ట్స్ బ్యానర్ తో ఉన్న ఒప్పందం ప్రకారం బోయపాటి శ్రీను బాలకృష్ణతో మరో సినిమా చేయాలని భావించినట్టు సమాచారం.
ఇలా గీత ఆర్ట్స్ బ్యానర్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించబోయే ఈ సినిమా 2027లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. బోయపాటి శ్రీను ఒప్పందం ప్రకారం గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి సరైనోడు 2 వస్తుందని అందరూ భావించారు కానీ బోయపాటి మాత్రం బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బిజీగా ఉన్నారు.
మహారాజు పాత్రలో బాలకృష్ణ..
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న NBK 111 సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తయ్యాయని , బాలయ్య త్వరలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బోయపాటితో బాలకృష్ణ బిజీ కాబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుంది.. ఇక బాలకృష్ణ గోపీచంద్ డైరెక్షన్లో చేయబోయే ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు నయనతార హీరోయిన్ గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మహారాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
Also Read: Simhadri Film: సింహాద్రి సినిమాకు రాజమౌళి డైరెక్టర్ కాదా.. అసలు డైరెక్టర్ ఎవరో తెలుసా?