E-Paper
Advertisement

Balakrishna: మూడు గంటల సినిమా అవసరమా? బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Balakrishna: మూడు గంటల సినిమా అవసరమా? బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Balakrishna Comments on Movie Duration: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. కొద్దిసేపట్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడబోతున్నాయని ఫ్యాన్స్ అంత ఆశపడ్డారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా మూవీ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరో సినిమాకు ఇలా జరగటం అనేది ఆశ్చర్యకరమైన విషయం.

బాలయ్య-బోయ హిట్ కాంబో

బోయపాటి శ్రీను దర్శకత్వంతో రూపొందిన ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.  బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు రాగా అవన్ని సూపర్ డూపర్ హిట్. ఇక మొదటిసారి అఖండతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాని రూపొందింది.  గతంతో వచ్చిన పార్ట్ వన్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేశారు. ముంబైలో మొదలుపెట్టి ఈ సినిమాను బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో విపరీతంగా ప్రమోట్ చేశారు.

ఇప్పుడు గంటల సినిమా అవసరమా?

Advertisement

సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ సినిమాలు గురించి సంచలమైన కామెంట్ చేశారు. ఈరోజుల్లో నేను చాలా సినిమాలు చూస్తూ ఉంటాను దాదాపు 3 గంటలు పైగా నిడివి ఉంటుంది. ఒక చిన్న పాయింట్ పట్టుకుని మూడు గంటల పాటు తీస్తారు అంత చేయడం అవసరమా అని నాకు అనిపిస్తుంది అని బాలకృష్ణ చెప్పారు. ఇక బాలకృష్ణ సినిమాలు విషయానికొస్తే బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమాలో ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ కూడా చెబుతారు. అయితే అఖండ 2 సినిమాలో సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పినట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమయిపోతుంది. అందుకే ఈ సినిమా గురించి ముంబై వేదికగా మాట్లాడుతూ ఈ సినిమా భారత దేశపు ఆత్మ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

Also Read: Allu Arjun-Sri Tej: శ్రీతేజ్‌ని పట్టించుకోని అల్లు అర్జున్.. రంగంలోకి దిల్ రాజు!

బాలకృష్ణ అభిమానులకు నిరాశ

Advertisement

అలాగే సినిమాలోని టీజర్ కూడా అంతే పవర్ఫుల్ గా కట్ చేసి సనాతన ధర్మం గురించి సాధువుల గురించి గొప్పగా చెప్పారు. అంతేకాకుండా కుంభమేళా వేదికగా ఈ సినిమాను షూటింగ్ కూడా చేశారు. మరోవైపు బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే అఖండ 2 సినిమా కోసం వాళ్లు విపరీతంగా ఎదురుచూశారు. కాసేపట్లో మా బాలయ్య బాబు మాస్ థియేటర్లో చూడబోతున్నాం అనుకునే తరుణంలో ఈ షోలు క్యాన్సిల్ అయిపోయాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆర్థిక సమస్యలు ఉండటం వలన ఈ షోలు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీనిని కూడా టెక్నికల్ ఇష్యూస్ వలన సోలు క్యాన్సిల్ అయినట్లు ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×