E-Paper
Advertisement

Allu Arjun-Sri Tej: శ్రీతేజ్‌ని పట్టించుకోని అల్లు అర్జున్.. రంగంలోకి దిల్ రాజు!

Allu Arjun-Sri Tej: శ్రీతేజ్‌ని పట్టించుకోని అల్లు అర్జున్.. రంగంలోకి దిల్ రాజు!
Advertisement

Allu Arjun-Sri Tej: పుష్ప 2 సంధ్య థియేటర్‌ ఘటన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ మూవీ ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పల్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఈకేసులో హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అయ్యి జైలుకి కూడా వెళ్లాడు.

అప్పుడు తెగ హడావుడి

అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మృతురాలి కుమారుడు శ్రీతేజ్‌ కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికిత్ప పొందాడు. ఇటీవలే కోలుకున్న అతడు ప్రస్తుతం రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరిగిన ఏడాది అవుతున్న సందర్భంగా మరోసారి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటల్లో సపోర్టు ఇస్తున్నట్టు మూవీ టీం, అల్లు అర్జున్‌ నానా హడావుడి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, అల్లు అరవింద్‌, సుకుమార్‌, అల్లు అర్జున్‌లు మొత్తం శ్రీతేజ్ దాదాపు రూ. 2.5 కోట్ల వరకు విరాళం ఇచ్చారు. అంతేకాదు భవిష్యత్తులో శ్రీతేజ్ కు అయ్యే వైద్య ఖర్చులన్ని తానే భరిస్తానని అల్లు అర్జున్‌ ప్రకటించాడు కూడా.

శ్రీతేజ్ పట్టించుకోని అల్లు అర్జున్

Advertisement

అయితే ఈ సపోర్టు కొంతకాలం వరకే పరిమితమైందని, ఆ తర్వాత ఇండస్ట్రీ, అల్లు అర్జున్‌ శ్రీతేజ్‌ని పట్టించుకోవడం లేదంటూ ఈ రోజు నుంచి వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. శ్రీతేజ్‌ ఆరోగ్యాన్ని అల్లు అర్జున్ గాలికి వదిలేసినట్టు సోషల్‌ మీడియా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. తాజాగా దిల్‌ రాజు శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ కలిశారు. సంధ్య థియేటర్ శ్రీ తేజ వ్యవహారంపై స్పందించిన దిల్ రాజు.. గతేడాది సంధ్య థియేటర్లలో గాయపడ్డ శ్రీతేజ్ కొంచ కొంచంగా కోలుకుంటున్నాడు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ ద్వారా ఇప్పించిన రూ. 2 కోట్లు అతడి పేరుపై డిపాజిట్‌ చేశాం. దానికి వచ్చే ఇంట్రెస్ట్‌ వారి అకౌంట్ లో యాడ్ అయ్యి ఖర్చులకు సాయం అయ్యేలా చేశాం.

Also Read: Naga Chaitanya: నీ ప్రయాణంలో భాగమవ్వడం నా అద్రష్టం.. మై లవ్‌, భార్యకు చై క్యూట్‌ రిప్లై

రంగంలోకి దిల్ రాజు

Advertisement

అలాగే బ్యాలెన్స్‌ డబ్బులు కూడా వారి అకౌంట్‌లో పడేలా అన్ని విధాలుగా చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడు రిహాబిలిటేషన్‌ సెంటర్‌ శ్రీతేజ్ చికిత్స కొనసాగుతుంది. మెరగైన వైద్యం కోసం అదనపు సాయం కావాలని అడిగారు. దీనిపై అల్లు అర్జున్‌తో మాట్లాడి సాయం అందేలా చూసుకుంటానని దిల్‌ రాజు హామీ ఇచ్చారు. ఘటన జరిగిన రెండో రోజు నుంచి మేము ఆశించిన సపోర్టు వచ్చింది. మొదటి నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అయితే శ్రీతేజ్‌కు ఇదే చికిత్స కొనసాగితే త్వరలోనే మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అదనపు ట్రీట్మెంట్‌ కోసం దిల్‌ రాజు గారిని కలిశాము. అల్లు అర్జున్‌ గారిని కలిసి చికిత్స కంటిన్యూ అయ్యేలా చూసుకుంటా అన్నారు” అని ఆయన చెప్పుకొచ్చారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×