Loan Apps: లోన్ యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 87 నకిలీ, అనధికార లోన్ యాప్స్‌పై బ్యాన్ విధించింది. ప్రజలను వేధిస్తున్న.. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్ యాప్స్‌పై కేంద్రం చర్యలు తీసుకుంది. సైబర్ మోసాలు, వడ్డీ దోపిడీలపై వచ్చిన ఫిర్యాదులతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. RBI, ఐటీ మంత్రిత్వశాఖ సమగ్ర సమీక్ష తర్వాత జాబితా సిద్ధం కానుంది. పౌరుల భద్రత, ఆర్థిక రక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం పేర్కొంది.