Bigg Boss 9 Telugu : గత ఏడు వారాల నుంచి తనకు కెప్టెన్సీ ఛాన్స్ రానివ్వట్లేదు అంటూ ప్రతి టాస్క్ లోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు డెమోన్ పవన్. అయితే ఎట్టకేలకు ఆ ఛాన్స్ వచ్చింది. కానీ, ఊహించని హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది డెమోన్ కు. కెప్టెన్సీ టాస్క్ ఆడుతూ మధ్యలోనే కుప్పకూలిపోయాడు. అసలు డెమోన్ కు ఏమైంది? మరిప్పుడు ఎలా ఉన్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే…
ఈరోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ రేసులో లేని కంటెస్టెంట్స్ కత్తిని తెచ్చి, తాము కెప్టెన్ గా చూడాలనుకున్న కంటెండర్ కు ఇస్తే, వాళ్ళు కత్తిని గుచ్చి ఎవరు కెప్టెన్ కావద్దు అనుకుంటున్నారో చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో చివరికి రీతూ, డెమోన్, కళ్యాణ్ మిగిలారు. కెంటెండర్ రేసులో లేని సంజన డ్యాగర్ ను తీసుకుని, డైరెక్ట్ గా కళ్యాణ్ దగ్గరకు వచ్చి “నీకిది ఇస్తే ఎవరిని తీసేస్తావ్ ?” అని అడిగింది. రీతూని తీసేస్తే, తన రివేంజ్ తీర్చుకున్నట్టు అవుతుందనేది సంజన ఉద్దేశం. ఎందుకంటే మొదట్లోనే రీతూ సంజనాను తీసేసింది. డెమోన్ హ్యాండ్ ఇచ్చేలా కనిపించడంతో కళ్యాణ్ రీతూని తీసేసి, డెమోన్ తో కెప్టెన్సీ ఆడతానని చెప్పేశాడు.
ఇక వీరిద్దరికీ మధ్య “రోడ్ టు కెప్టెన్సీ” టాస్క్ నడిచింది. ఆ టాస్క్ లో గుంతలుగా ఉన్న రోడ్లను బిగ్ బాస్ ఇచ్చిన ఇసుక, కాంకరతో సమం చేయాలి. ఈ టాస్క్ లో డెమోన్ వర్సెస్ పవన్ మధ్య నడిచిన హోరాహోరీ పోటీ పోటీ కన్నుల పండుగగా సాగింది. కానీ చివరికి వచ్చేసరికి డెమోన్ సడన్ గా నొప్పిగా ఉందంటూ కుప్పకూలాడు. దీంతో హౌస్ లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుగా టాస్క్ జరుగుతోంది కాబట్టి ఎవ్వరూ అతని కోసం ముందుకు రాలేదు. కానీ నిమిషాల్లోనే అతని గాయం తీవ్రత అర్థం కావడంతో చుట్టూ మూగారు. మరోవైపు రీతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడిని అతని హెల్త్ బాగుండాలని వేడుకుంది.
డెమోన్ వెన్ను నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో వెంటనే బిగ్ బాస్ అతడిని మెడికల్ రూమ్ కి పిలిచాడు. అక్కడకు వెళ్తూ కూడా గేమ్ కోసం చాలా కష్టపడ్డా, బ్యాడ్ లక్ అంటూ డెమోన్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. రీతూ ఏం కాదులే అని ఓదార్చి డాక్టర్ చెకప్ కు పంపింది. ట్రీట్మెంట్ అనంతరం డెమోన్ బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. అక్కడ కూడా మా అమ్మానాన్న చాలా బాధపడి ఉంటారు ఇది చూసి. ఎంత ట్రై చేసినా కెప్టెన్ కాలేకపోయాను అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు డెమోన్. కానీ రీతూ పక్కనే ఉండి, ఇది కాకపోతే ఫినాలే, కప్పు ఉన్నాయిగా గెలుచుకోవడానికి అని సర్దిచెప్పింది.
అయితే డెమోన్ ను చూసి కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అలాగే డెమోన్ కూడా కళ్యాణ్ ను చూసి ‘పోనీలే మనోడే కదా కెప్టెన్ అయ్యింది’ అంటూ సరిపెట్టుకున్నాడు. వీళ్లిద్దరిదీ హౌస్ లో బ్యూటిఫుల్ బాండింగ్. అందుకే చివరికి కళ్యాణ్ కు కెప్టెన్ బ్యాండ్ ను తొడిగేటప్పుడు ఇద్దరూ కలిసి సంతోషంగా కన్పించారు.
Read also : దివ్యపై రీతూ, తనూజా డైరెక్ట్ అటాక్… కెప్టెన్సీ టాస్క్ లో డెమోన్ ను తీవ్ర గాయం