E-Paper
Advertisement

దేవాన్షును చూసి తెగ మురిసిపోతున్న బాలయ్య బాబు.. మరి ఎంట్రీ సంగతేంటి?

దేవాన్షును చూసి తెగ మురిసిపోతున్న బాలయ్య బాబు.. మరి ఎంట్రీ సంగతేంటి?
Advertisement

Devansh Entry: నందమూరి వంశం అంటేనే ఒక లెగసీ. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నుంచి నందమూరి బాలకృష్ణ వరకు ఆ వారసత్వం వెండితెరపై అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే మూడో తరం వారసుడు, నారా లోకేష్ – బ్రాహ్మణిల కుమారుడు దేవాన్ష్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Read also-మదర్స్ డే రోజున రోజా కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అది గిఫ్ట్ కాదు!

మురిసిపోతున్న బాలయ్య!

Advertisement

నందమూరి బాలకృష్ణ తన మనవడు దేవాన్ష్‌తో గడిపే ప్రతి క్షణం అభిమానులకు పండగే. అయితే ఇటీవల దేవాన్ష్‌ను చూస్తూ బాలయ్య బాబు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారట. 1974లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మకల’ సినిమా ద్వారా బాలయ్య బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పట్లో ఆ సినిమాలో బాలయ్య బాబు ఎలా ఉండేవారో, ఇప్పుడు దేవాన్ష్ అచ్చం అలాగే ఉన్నాడని నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంటుంటారు. “వీడు అచ్చం నా చిన్నప్పటి పోలికే.. నా తండ్రి లక్షణాలు కనిపిస్తున్నాయి” అంటూ బాలయ్య తన మనవడిని చూసి గర్వంగా మురిసిపోతున్నారట.

వైరల్ అవుతున్న ఫోటోలు

బాలయ్య బాబు దేవాన్ష్‌ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దేవాన్ష్ కళ్ళలో ఉన్న తీక్షణత, ముఖంలో ఉన్న వర్చస్సు చూస్తుంటే అచ్చం నందమూరి తారకరామారావుని గుర్తుకు తెస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాతా-మనవళ్ల మధ్య ఉన్న ఈ అనుబంధం చూసి అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు నారా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Read also-ఎన్టీఆర్ ఆ స్టైలిష్ లుక్ ఒరిజినల్ కాదా?.. మరీ దిగజారిపోతున్న పీఆర్ టీమ్..

దేవాన్ష్ ఎంట్రీ ఎప్పుడు?

ఈ వార్తలు బయటకు రావడంతో నందమూరి అభిమానులు అప్పుడే దేవాన్ష్ వెండితెర ఎంట్రీపై అంచనాలు మొదలుపెట్టేశారు. బాలయ్య బాబు తన కెరీర్ మొదలుపెట్టినట్లే, దేవాన్ష్ కూడా ఏదైనా చారిత్రక లేదా పౌరాణిక చిత్రంలో బాలనటుడిగా మెరిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవాన్ష్ ఫోటోలు చూసిన కొందరు సినీ విశ్లేషకులు, భవిష్యత్తులో ఈ నందమూరి వారసుడు వెండితెరపై రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి దేవాన్ష్ చదువుపైనే కుటుంబ సభ్యులు పూర్తి శ్రద్ధ పెట్టినప్పటికీ, నందమూరి అభిమానులు మాత్రం దేవాన్ష్‌ను వెండితెరపై చూసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘తాతమ్మకల’ నాటి బాలయ్యను దేవాన్ష్‌లో చూసుకుంటూ, తమ అభిమాన హీరో మనవడిని భావి సూపర్ స్టార్‌గా ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు. అయితే దేవాన్ష్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×