NTR Devara 2 : జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కలయికలో ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే.. సహజంగానే అంచనాలు పెరుగుతాయి. అందులోనూ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవడంతో.. ఇంకా ఎక్కువే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ‘దేవర’ పై మొదటి నుండి హైప్ భారీగా ఏర్పడింది. ‘ఆచార్య’ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ‘దేవర’ పై హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. దీంతో ‘దేవర’ కి తిరుగు లేదు అని అంతా భావించారు. కానీ సినిమా హాఫ్ బేక్డ్ అంటూ రివ్యూస్ వచ్చాయి.
విమర్శకులు సినిమాని ఏకి పారేశారు. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ‘దేవర’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత రూ.500 పోస్టర్ వేసుకుని ఆ ఓపెనింగ్స్ పరువు కూడా తీసేసుకున్నారు మేకర్స్. మొత్తంగా ‘దేవర’ ఓ యావరేజ్ సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అంటూ డప్పు కొట్టుకున్నారు. అదెలా ఉన్నా.. సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్రీకరణ దశలోనే దర్శకుడు కొరటాల శివ ఓ వీడియో బైట్ రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే ‘దేవర’ క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం జరిగింది.
అయితే కమర్షియల్ గా ‘దేవర’ ఫలితం సంగతి ఎలా ఉన్నా.. కంటెంట్ పరంగా ఆడియన్స్ ని మెప్పించలేదు. దీంతో ‘దేవర 2’ ఉండదేమో అని అంతా అనుకున్నారు. ఏడాది దాటినా ‘దేవర 2’ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. ఎన్టీఆర్ మాత్రం ‘దేవర 2’ కచ్చితంగా ఉంటుందని చెప్పాడు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ‘దేవర 2’ చేస్తానని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మనసు మార్చుకుని ‘దేవర 2’ గుడ్ బై చెప్పినట్టు లేటెస్ట్ టాలీవుడ్ టాక్.
అందుకు కారణం ‘వార్ 2’ అని కొందరు చెబుతున్నారు. ‘టెంపర్’ నుండి ఎన్టీఆర్ కి ప్లాప్ లేదు. కొన్ని యావరేజ్ ఫలితాలతో పర్వాలేదు అనిపించాయి. కానీ ‘వార్ 2’ డిజాస్టర్ అయ్యింది. ఎన్టీఆర్ నటనపై కూడా విమర్శలు కురిశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది.నార్త్ లో అయితే ఎన్టీఆర్ లుక్స్ పై విమర్శల వర్షం కురిసింది.
అందువల్ల ‘దేవర 2’ ఎన్టీఆర్ చేయకూడదని డిసైడ్ అయినట్టు అంతా చెప్పుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కనుక చొరవ చేసుకుంటే ‘దేవర 2’ సెట్స్ పైకి వెళ్లడం పెద్ద విశేషం ఏమీ కాదు. ‘దేవర 2’ కి ఎన్టీఆర్ 26 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందట. సో కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణ భాగస్వామి కాబట్టి.. ఎన్టీఆర్ ని ఒప్పించి ‘దేవర 2’ చేయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం టైం పట్టొచ్చు.