E-Paper
Advertisement

Bhagyashree Borse : వాళ్లతో కలిసి పని చేయాలని ఉంది, భాగ్యశ్రీ కోరిక నెరవేరుతుందా?

Bhagyashree Borse : వాళ్లతో కలిసి పని చేయాలని ఉంది, భాగ్యశ్రీ కోరిక నెరవేరుతుందా?
Advertisement

Bhagyashree Borse : మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఒక హీరోయిన్ కు ఏ క్వాలిటీస్ అయితే ఉండాలి అని అనుకుంటాము అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ రావడం అనేది అంత ఈజీ కాదు. విపరీతమైన హార్డ్ వర్క్ చేసిన కూడా కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి.

ఇప్పటివరకు భాగ్యశ్రీ దాదాపు మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ మూడు సినిమాల్లో ఒకటి కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. మిస్టర్ బచ్చన్ సినిమా సినిమా మీద మంచి అంచనాలు ఉండేవి. కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్డమ్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ముఖ్యంగా ఈమెను ఎందుకు పెట్టారా అనిపించేటట్లు ఉంటుంది క్యారెక్టర్.

వాళ్లతో కలిసి పనిచేయాలని ఉంది 

Advertisement

కొంతమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కొంతమంది దర్శకులతో పనిచేయాలి అని బలంగా అనిపిస్తుంది. కానీ ఆయా దర్శకులు చేస్తున్న ప్రాజెక్టుల వలన అవి డిలే అవుతూ వస్తుంటాయి. భాగ్యశ్రీ బోషే విషయానికి వస్తే ఎస్.ఎస్ రాజమౌళి మరియు సంజయ్ లీల బన్సాలి సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే ఆ స్థాయి టార్గెట్ పెట్టుకోవడం అనేది మంచి విషయమే. అని ప్రస్తుతం ఆయా దర్శకులకు ఉన్న కమిట్మెంట్స్ వలన అది జరుగుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాజమౌళి ఒక సినిమా తీశారు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు దాని మీదే కూర్చుంటారు. ఆ తరుణంలో ఆ సినిమాల్లో నటించే హీరోయిన్లు ఇంకో సినిమాలు చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అది కొంచెం జరగాలి అంటే కష్టమైన పని.

సక్సెస్ అందుతుందా? 

Advertisement

భాగ్యశ్రీ ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలుక అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒకవైపు రామ్ కూడా ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమాతో భాగ్యశ్రీ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. మరోవైపు రామ్ తో భాగ్యశ్రీ రిలేషన్ లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి కానీ దీని గురించి ఇంకా వారిద్దరూ ఏమీ అధికారికంగా ప్రకటించలేదు.

Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు ఏం మాట్లాడాడంటే? సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×