E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ పోరు.. మానస్‌ వర్సెస్ డిమోన్.. డ్యాన్స్ తో తికమక పెట్టిన మాజీ కంటెస్టెంట్

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ పోరు.. మానస్‌ వర్సెస్ డిమోన్.. డ్యాన్స్ తో తికమక పెట్టిన మాజీ కంటెస్టెంట్
Advertisement

Bigg Boss 9 Day 80 Promo 3: ప్రస్తుతం బిగ్‌ బాస్‌ ఇంట్లో కెప్టెన్సీ పోరు జరుగుతుంది. ఈ వారం కెప్టన్సీ టాస్క్‌ని కొత్త ప్లాన్‌ చేశాడు. హౌజ్‌మేట్స్‌ మధ్య ఫైట్‌ కాకుండ మాజీ కంటెస్టెంట్స్‌తో కంటెండర్స్‌ని టాస్క్‌ ఆడిస్తున్నాడు. ఇందులో గెలిచిన వారు ఈ వారం కెప్టెన్ అవుతున్నారు. ఇక ఇదే చివరి కెప్టెన్సీ కూడా. దీనిని తర్వాత ఇక కంటెంట్స్‌ ఫినాలేకు పోటీ పడాలి. ఇదే హౌజ్‌మేట్స్‌ చివరి కెప్టెన్సీ. ఇందుకోసం రోజుకో మాజీ కంటెస్టెంట్‌ని హౌజ్‌లోకి దింపుతుంది.

ఓడిన భరణి, తనూజ

Advertisement

ఇప్పటికే హౌజ్‌లోకి గౌతమ్‌, ప్రేరణలు హౌజ్‌ లోకి వచ్చి కంటెస్టెంట్స్‌ సందడి చేయడమే కాదు కెప్టెన్సీ టాస్క్ లో టఫ్‌ ఫైట్‌ ఇచ్చారు. కెప్టెన్సీ కోసం గౌతమ్‌తో భరణి పోటీ పడగా.. ఇందులో భరణి ఓటమి పాలయ్యాడు. నిన్న ప్రేరణ హౌజ్లోకి వచ్చింది ఆడిపాడింది. చివర్లో కెప్టెన్సీ కోసం తనూజతో పోటీ పడింది. ఇందులో ప్రేరణ స్పీడ్‌ అందుకోలేక వెనకంజ వేసింది. దీంతో కెప్టెన్సీ ఆమె చేజారింది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా మాజీ కంటెస్టెంట్స్, బ్రహ్మముడి ఫేం మానస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తాజాగా ప్రొమోలో చూపించారు. మానస్‌ రాగానే హౌజ్‌ మేట్స్‌ అందరి ముఖాలు నవ్వుతో వెలిగిపోయాయి.

Also Read: Aadi Sai Kumar: మరోసారి తండ్రి కాబోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో..

Advertisement

మానస్ ఎంట్రీ.. హౌజంత సందడి

అతడు రాగానే అంత సంతోషంలో డ్యాన్స్ వేస్తూ స్వాగతం పలికారు. కంటెస్టెంట్స్‌ తనదైన స్టైల్లో పజిల్‌ పెట్టాడు మానస్‌. మానస్‌ మంచి డ్యాన్సర్‌ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌ లైన్లో పెట్టి.. లాస్ట్‌ లో ఉన్న వారాకి ఓ స్టెప్‌ వేసి దానికి తన ముందు ఉన్న వాళ్లకు వేసి చూయించాలి. అలా చివరి వరకు వారు వారు ఆ స్టెప్‌ తమ ముందు వాళ్లకి చూపించాలి. అలా చివరికి అదే స్టేప్‌ వేయాలి. ఈ క్రమంలో ముందు తనూజకి మానస్‌ స్టేప్‌ వేసి చూయించాడు. ఇలా హౌజ్ మేట్స్‌ని తన డ్యాన్స్‌ స్టెప్‌తో తికమక పెట్టాడు మానస్‌. ఆ తర్వాత హౌజ్‌లో బిగ్‌ బాస్‌ పెట్టిన గేమ్‌ రూల్స్‌ ప్రకారం హౌజ్‌మేట్స్‌ని ఆటలు ఆడించాడు.

డిమోన్ వర్సెస్ మానస్

చివరికి కెప్టెన్సీ కోసం మానస్‌ ఒకరితో యుద్దం చేయాలని ఆదేశించాడు బిగ్‌ బాస్‌. ఇందుకోసం ఇచ్చిన ‘నెయిల్‌ ఇట్‌ టూ విన్‌ ఇట్‌’ పేరుతో బాల్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌ రూల్‌ ప్రకారం పోటీ దారులు ట్రాక్‌ నుంచి విడుదల చేస్తున్న బాల్స్‌ని జిగ్‌ జాగ్‌ వే ద్వారా పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టుకోవాలి. ఆ బాల్‌ ని మళ్లీ అక్కడ అమర్చిన నెయిల్స్‌ కి గుచ్చుకునేలా విసరాలి. ఇలా ఎవరూ ఎన్ని ఎక్కువ బాల్స్‌ చేస్తే వాళ్లి విజయం సాధించినట్టు. ఈ కెప్టెన్సీ టాస్క్‌ కోసం డిమోన్‌ పవన్‌ మానస్‌తో పోటీ పడ్డాడు. ఇద్దరు కూడా పోటీ పోటీగా టాస్క్‌ ఆడారు. ప్రొమో ప్రకారం ఈ టాస్క్‌లో ఎక్కువ బాల్స్‌ మానస్‌ నెయిల్స్‌కి వేసినట్టు కనిపించింది. కానీ, గెలిచిందేవరనేది మాత్రం ఈ ప్రొమో చూపించలేదు. మరి ఈ కెప్టెన్సీ టాస్క్‌లో విన్నర్‌ ఎవరనేది తెలియాలంటే ఫుల్‌ ఎపిసోడ్‌ వరకు వేయిట్‌ చేయాల్సిందే.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×