E-Paper
Advertisement

నాని ‘పారడైజ్’తో మెగాస్టార్ కనెక్షన్.. శ్రీకాంత్ ఓదెల మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!

నాని ‘పారడైజ్’తో మెగాస్టార్ కనెక్షన్.. శ్రీకాంత్ ఓదెల మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!
Advertisement

Paradise Cinematic Universe: టాలీవుడ్‌లో ‘దసరా’ లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాచురల్ స్టార్ నాని, లీడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. తాజాగా ఈ మూవీ చుట్టూ ఒక సెన్సేషనల్ బజ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి ఒక ఊహించని కనెక్షన్ ఉండబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read also-Podarillu Today Episode : అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..పెద్దోడికి హిందీ కష్టాలు.. ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. అయ్యో చక్రీ..

ఒకే యూనివర్స్?

Advertisement

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘పారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ సినిమా చేయాల్సి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు సినిమాల కథలకూ మధ్య ఒక బలమైన ఇంటర్ లింక్ ఉండబోతోందట. లోకేష్ కనగరాజ్ ‘ఎల్సీయూ’ (LCU) తరహాలోనే, శ్రీకాంత్ ఓదెల కూడా తన సినిమాలతో ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.

క్లైమాక్స్‌లోనే అసలైన మెగా ట్విస్ట్!

ఈ ఇంటర్ లింక్‌కు సంబంధించి వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ‘పారడైజ్’ సినిమా క్లైమాక్స్‌లోనే చిరంజీవి సినిమాకు సంబంధించిన లీడ్ (హింట్) కనిపించబోతోందట. అంటే నాని సినిమా ముగిసే ఆఖరి నిమిషాల్లో, మెగాస్టార్ ప్రాజెక్ట్ కథ దేని గురించై ఉంటుంది అనే సస్పెన్స్‌ను రివీల్ చేస్తూ డైరెక్టర్ క్లైమాక్స్ డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఇదే గనుక నిజమైతే థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ లభించడం ఖాయం.

Advertisement

Read also-శరీర ఆకృతిపై అమ్మాయిలకు బాలీవుడ్ నటి తాప్సీ పన్ను హితవు.. ఏం చెప్పారంటే?

‘పారడైజ్’ కి ప్రీక్వెల్ కూడా రెడీ!

కథను కేవలం ఈ రెండు సినిమాలతోనే ముగించకుండా, దీనిని మరింత పెద్దదిగా విస్తరించే యోచనలో ఉన్నారట శ్రీకాంత్ ఓదెల. ఇందులో భాగంగానే ‘పారడైజ్’ సినిమాకు ఒక ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రీక్వెల్ ద్వారా అసలు కథ ఎక్కడ మొదలైంది అనేది చూపించబోతున్నారట. మొత్తానికి నాని ‘పారడైజ్’, మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ, అలాగే ఒక ప్రీక్వెల్.. ఇలా మూడు సినిమాలను ఒకే తాటిపైకి తెస్తూ శ్రీకాంత్ ఓదెల అల్లుతున్న ఈ స్క్రీన్ ప్లే మ్యాజిక్ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రేజీ కనెక్షన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్, నాని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×