Paradise Delay: టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే డిస్కషన్ ..నేచురల్ స్టార్ నాని యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్యారడైజ్ అనుకున్న సమయానికి వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తున్న పెద్ద ప్రశ్న .నిజానికి ఈ సినిమా 2026 ఆగస్టు నెల చివర్లోనే రిలీజ్ కావాలి మేకర్స్ అలానే ప్లాన్ చేశారు .
కానీ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ కాస్త వెనక్కి వెళ్లిన పరిస్థితి.ఆ తర్వాత సెప్టెంబర్ 24న గ్రాండ్ గా మూవీని థియేటర్లోకి రిలీజ్ చేస్తారు అన్న ప్రచారం తెగ సర్కులేట్ అయింది.కానీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడం మూవీ లవర్స్ డిసప్పాయింట్మెంట్ అయిపోయారు.
ఉన్న క్రేజ్ కాస్త పోయే ప్రమాదం
ఇక సినిమా ఇలాగే వాయిదాల పాట పాడితే మాత్రం ఉన్న క్రేజ్ కాస్త పోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నాయి ట్రేడ్ సర్కిల్స్ .నిజానికి శ్రీకాంత్ ఓదెల సినిమాని ఎంతో పర్ఫెక్షన్ తో చెక్కాలన్న తపనతోనే ఇంత సమయం తీసుకుంటున్నాడట .అయితే దీనివల్ల ఒకవైపు ప్రొడక్షన్ బడ్జెట్ పెరిగిపోతుంటే మరోవైపు సరైన టైమ్ కి అప్డేట్స్ రాక సినిమాపై ఉన్న బజ్ కాస్త తగ్గిపోతుంది.
Also read :జబర్దస్త్ వర్ష సంపాదన చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!
దీంతో అలర్ట్ అయిన నాని ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగాడట. సినిమాపై బజ్ కాస్త తగ్గిపోతే రిజల్ట్ తేడా కొడుతుందని గ్రహించిన నాని మిగిలిన పెండింగ్ టాకీపార్టుతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులని స్పీడ్ అప్ చేయాలని మూవీ టీం కి వార్నింగ్ ఇచ్చినట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట .
నిజానికి నాని ఈ రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఈ మధ్య వచ్చిన పెద్ది అనే తెలుస్తుంది.
పెద్ది సినిమానే ఉదాహరణ
అవును ఫ్యాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన పెద్ది సినిమాకి రిలీజ్ డేట్ పదేపదే మారితే బిజినెస్ పరంగా ఎంత నష్టం జరిగిందో క్లియర్ గా నిరూపించింది.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నుండి చికిరి అనే సాంగ్ బయటకు వచ్చినప్పుడు నేషనల్ వైట్ గా మంచి రెస్పాన్స్ దక్కింది కానీ. ఆ తర్వాత సినిమా వాయిదాల పాట పాడటం, ఇక మేకర్స్ కూడా అప్ డేట్స్ ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ట్రైలర్ వచ్చిన సమయానికి ఆడియన్స్ లో ఉండాల్సిన అసలైన జోష్ మొత్తం ఆవిరైన పరిస్థితి.
డిసిషన్ తీసుకున్న నేచురల్ స్టార్
దీంతో చరణ్ ఇమేజ్ వల్ల సినిమా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల క్లబ్ లో చేరినప్పటికీ నార్త్ బెల్టుతో పాటు ఇతర భాషలలో అనుకున్న కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది.ఇప్పుడు పెద్ది చేసిన ఆ చిన్న పొరపాటును ప్యారడైజ్ కూడా రిపీట్ చేస్తే చాలా కష్టమని ఈ డిసిషన్ తీసుకున్నాడట మన నేచురల్ స్టార్.
మరోవైపు నిర్మాతలకి డిజిటల్ రైట్స్ పరంగా పెద్ద ఇబ్బంది వచ్చినట్టు కనిపిస్తుంది.
ఇప్పటికే ప్రముఖ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ అగ్రిమెంట్ చేసుకోగా,అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతే వచ్చే డీల్ లో భారీగానే కోత విధించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి .
ఫైనాన్షియల్ గా ప్రొడక్షన్ హౌస్ కి పెద్ద దెబ్బ
ఇక సినిమా గనుక సెప్టెంబర్ నెలాఖరు రిలీజ్ లేకపోతే మాత్రం ఫైనాన్షియల్ గా ప్రొడక్షన్ హౌస్ కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. దీని తోడు రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ అందిస్తున్న మ్యూజిక్ అప్డేట్స్ కూడా ఆగిపోయాయి. ఆయా షేర్ అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్ నేషనల్ వైడ్ గా దుమ్ము దులిపగా, సెకండ్ సింగిల్ కూడా అదే కంటిన్యూ చేస్తారనుకున్నారు కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదు .
సినిమాలో వేగం పెంచుతాడో లేదో
ఏది ఏమైనా ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేసిన నాని ఈసారి ఏడాదికాలంగా ఎలాంటి ప్రాజెక్ట్ వదలకపోవడంతో డీలపడిపోయారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్. మరోపక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందనుకున్న బ్లడీ రోమియో నుంచి కూడా ఇప్పుడు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అసలు సినిమా ఉంటుందా లేదా మనల్ని మొదలయ్యాయి చూడాలి మరి ఇకనైనా మన నేచురల్ స్టార్ వదిలే సినిమాలో వేగం పెంచుతాడో లేదో !