E-Paper
Advertisement

17 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ అఘాయిత్యం… 7.5 రేటింగ్ తో అదరగొడుతున్న సినిమా తెలుగులోనే

17 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ అఘాయిత్యం… 7.5 రేటింగ్ తో అదరగొడుతున్న సినిమా తెలుగులోనే
Advertisement

Social Crime Drama : హ్యాపీగా సాగిపోతుంది అనుకున్న లైఫ్ ను, దిక్కుతోచని స్థితిలోకి తీసుకెళ్లడానికి ఊహించని ఒకే ఒక్క సంఘటన చాలు. ఒక్క రాత్రి పార్టీ కొంతమంది అబ్బాయిల జీవితాలను ఎలా నాశనం చేసింది ? ఐఏఎస్ కావాలని కలలు కన్న అమ్మాయిపై ఆ పార్టీ వల్ల ఎలాంటి కోలుకోలేని దెబ్బ పడింది ? అన్నది తెలియాలంటే ‘యూఫోరియా’ (Euphoria) అనే ఈ సినిమాను చూడాల్సిందే. 2026లోనే తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

చైత్ర ఐఏఎస్ కావాలనే బలమైన ఆశయమున్న టాపర్ స్టూడెంట్. ఆ అమ్మాయే సినిమాలో మన మెయిన్ లీడ్. ఒకరోజు తన స్నేహితురాలితో కలిసి పబ్‌ పార్టీకి వెళ్తుంది. మంచి అమ్మాయి కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆమెకు అడ్డు చెప్పకుండా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి పంపిస్తారు. పార్టీ అనంతరం తిరిగి వస్తున్న సమయంలో వికాస్, అతని స్నేహితుల గ్యాంగ్ కారులో ఎక్కుతుంది చైత్ర.

Advertisement

బాగా పలుకుబడి ఉన్న మైనర్ యువకులు వాళ్ళు. డ్రగ్స్ మత్తులో చైత్రపై దారుణంగా అఘాయిత్యం చేస్తారు. ఈ సంఘటన చైత్రను కుంగదీస్తుంది. అయినప్పటికీ జరిగిన దారుణాన్ని చైత్ర ధైర్యంగా తన తల్లికి చెప్పడంతో, పోలీసు కేసు నమోదు చేస్తారు. ఈ కేసును టేకప్ చేస్తాడు పోలీస్ కమిషనర్ జయదేవ్. అయితే నిందితులు మైనర్లు కావడంతో పోక్సో యాక్ట్ కింద విచారణ స్టార్ట్ చేస్తారు. నిందితులంతా సమాజంలో బాగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు. అందుకే పోలీసులపై విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి.

మిగతా వాళ్ళ తల్లిదండ్రులంతా తమ పిల్లల తప్పును కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ తన కొడుకు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారి అని తెలిసినప్పుడు తల్లి వింధ్య చలించిపోతుంది. సమాజానికి బుద్ధి చెప్పాల్సిన విద్యాసంస్థల అధినేతగా ఉంటూ, తన కొడుకే ఇలాంటి తప్పు చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోతుంది. దీనికి బాధ్యత వహిస్తూ ఆమె తన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేస్తుంది.

Advertisement

కొడుకును కాపాడాలంటూ భర్త నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ, ఆమె చైత్రకే మద్దతుగా నిలుస్తుంది. స్వయంగా కొడుకు తప్పును నిరూపించే కీలక ఆధారాలను పోలీసులకు అప్పగించి, కోర్టులో సాక్ష్యం చెబుతుంది. మరి ఆ తరువాత కేసు ఎలాంటి మలుపు తిరిగింది ? వికాస్ కు ఎలాంటి శిక్ష పడింది ? సొంత తల్లే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ? చివరికి చైత్ర లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను వీక్షించాల్సిందే.

నాలుగు ఓటీటీలలో స్ట్రీమింగ్

భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన ‘యుఫోరియా’ అనే సోషల్ క్రైమ్ డ్రామా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆహా, ETV Win, JioHotstar, Amazon Prime Videoలలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Read Also: కూతురు కోసం ప్రపంచాన్ని పీకి పందిరేసే తండ్రి… ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా

Tags

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×