E-Paper
Advertisement

ముల్లోకాలను శాసించే శక్తి గల బ్రహ్మకమలం దొంగతనం… తెలుగు మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ

ముల్లోకాలను శాసించే శక్తి గల బ్రహ్మకమలం దొంగతనం… తెలుగు మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ షురూ
Advertisement

Telugu Fantasy Adventure: విజువల్ వండర్ గా రూపొందిన ఓ భారీ కొత్త చిత్రం తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. దానిదేం ఉంది ? కొత్త సినిమాలు అన్నప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రావాల్సిందే కదా అంటారా ? నాలుగు వారాల థియేట్రికల్ విండో తరువాతే సినిమాలు ఇలా ఓటీటీలో అడుగు పెడతాయి. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లలో రిలీజ్ అయిన మూడు వారాల వ్యవధిలోనే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఆ వంద కోట్ల భారీ సినిమానే ‘నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్’ (Naga Bandham The Secret Treasure). మరి ఈ సినిమా ఓటీటీలోకి ఇంత త్వరగా రావడానికి కారణం ఏంటి ? మూవీని ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ప్రాచీన కాలంలోని ఒక పురాతన విష్ణు దేవాలయంతో సినిమా షురూ అవుతుంది. ఆ కాలంలో ఒక అపారమైన దైవిక నిధిని రహస్య భూగర్భ గదిలో భద్రపరుస్తారు. ఆ నిధి లోక కల్యాణం కోసం మాత్రమే ఉపయోగపడాలని, సాధారణ మానవులు ముట్టుకోకుండా దానికి ‘నాగబంధం’ అనే శక్తివంతమైన ఆధ్యాత్మిక ముద్రను వేస్తారు. ఈ ముద్రను ఛేదించడం సామాన్యులకు అసాధ్యం. ఎవరైనా దురాశతో దాన్ని తాకితే పవిత్ర సర్పాల శాపం పడుతుంది.

Advertisement

ఇక్కడి నుంచి కథ ఆధునిక కాలంలోకి మారుతుంది. అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లర్, మన విలన్ జగపతిబాబు. అతని అనుచరుడు ఈ నిధి గురించి తెలుసుకుంటారు. ఆధునిక సాంకేతికత, కొందరు క్షుద్ర మాంత్రికుల సహాయంతో ఆ ఆలయ రహస్యాన్ని కనిపెడతారు. కానీ ఆ నాగబంధం సీల్‌ ను బ్రేక్ చేయాలంటే ఒక పవిత్రమైన వస్తువు కావాలి. అదే హిమాలయాల్లో మాత్రమే లభించే అరుదైన బ్రహ్మకమలం పుష్పం. అలాగే ఓ వంశానికి చెందిన రక్తం అవసరమని తెలుసుకుంటారు.

మరోవైపు హీరో రుద్ర ఎంట్రీ ఉంటుంది. అతనికి పురాతన కట్టడాలు, చరిత్ర అంటే చాలా ఇష్టం. అనుకోకుండా అతనికి ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని వింత సంకేతాలు, కలలు రావడం మొదలవుతుంది. ఈ క్రమంలోనే అతనికి హీరోయిన్ పరిచయమవుతుంది. ఆమె కూడా ఈ పురాతన రహస్యాలపై పరిశోధన చేస్తుంటుంది. ఇద్దరూ కలిసి ఆ రహస్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తారు. అంతలోనే విలన్ల బృందం ఆ పవిత్ర వస్తువులను దక్కించుకుని, ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది.

Advertisement

ఆ సమయంలో ప్రకృతిలో వింత మార్పులు చోటుచేసుకుంటాయి. సనాతన ధర్మాన్ని, ఆ దైవిక నిధిని కాపాడటానికి ప్రకృతి ‘రుద్ర’ను ఒక సాధనంగా ఎంచుకుంటుంది. విలన్లు ఆ నిధిని తాకినప్పుడు నాగబంధం శక్తులు మేల్కొని భయంకరమైన సర్పాల రూపంలో వారిపై దాడి చేస్తాయి. అంతేకాదు ఈ టైమ్ లోనే హీరో ప్రాణంగా ప్రేమించే తల్లిని, చెల్లిని విలన్ల చేతుల్లో పోగొట్టుకుంటాడు. అంతేకాదు హీరోయిన్ కు సంబంధించిన షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది.

ఇంతకీ హీరోకి తెలిసిన ఆ షాకింగ్ నిజం ఏంటి ? హీరోయిన్ ఎవరు ? అదే రూపంతో పరిచయం అయిన మరో అమ్మాయి కథ ఏంటి ? చివరికి హీరో ఆ దుష్టులపై ఒంటి చేత్తో ఎలా పోరాటం చేశాడు ? ‘నాగబంధం’ను ఎలా కాపాడాడు ? అన్నది తెలియాలంటే ఈ సినిమం చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

విరాట్ కర్ణ, నభా నటేష్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించగా, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, దక్ష నాగర్కర్, మురళీ శర్మ, రిషబ్ సావ్నీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ భారీ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ కు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీకి డిజాస్టర్ టాక్ తెచ్చకుకోవడంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×