E-Paper
Advertisement

Amalapaul: నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైంది.. అమలాపాల్ కామెంట్స్!

Amalapaul: నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైంది.. అమలాపాల్ కామెంట్స్!
Advertisement

Amalapaul:ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ (Amala Paul)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చేసి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా ఒక జ్యోతిష్యుడు తన పెళ్లి గురించి ముందే చెప్పాడని.. ఆ సమయంలో తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడని.. అలాంటప్పుడు పెళ్లి ఎలా జరుగుతుందో అనుకున్నానని అమలాపాల్ తెలిపింది.

జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది..

తన పర్సనల్ లైఫ్ గురించి అమలాపాల్ మాట్లాడుతూ.. “ఒక జ్యోతిష్యుడు నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేని సమయంలో నా పెళ్లి గురించి చెప్పాడు. అలాంటప్పుడు నాకు పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నాను.. కానీ ఆయన చెప్పినట్లుగానే కొద్ది రోజులకే గోవాలో జగత్ దేశాయ్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచే మా పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలానికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇక ఆ సమయంలో పెళ్లి గురించి ఆలోచించక పోయినా.. అప్పుడున్న పరిస్థితులలో వివాహం తప్పనిసరి కాబట్టే.. నేను గర్భంగా ఉన్నప్పుడే వివాహం చేసుకున్నాను.

Advertisement

మా జీవితంలో ఈ పరిణామాలు చాలా త్వరగా జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలు మన గమ్యాన్ని ఎలా మారుస్తాయో చెప్పడానికి నేనే ఉదాహరణ. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కొడుకు, నా భర్త జగత్ తో జీవితం మరింత సంతోషంగా మారిపోయింది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి” అంటూ చెప్పుకొచ్చింది అమలాపాల్. ఇంకా ప్రస్తుతం అమలాపాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:Nani Bloody Romeo: బ్లడీ రోమియో కోసం డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. ఒకరు కాదు ఏకంగా ముగ్గురు!

మొదటి భర్తకు విడాకులు.. జగత్ తో ప్రేమ, పెళ్లి..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరియర్ పీక్స్ లో ఉండగానే తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ (AL Vijay) ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.. ఈ జంట అప్పట్లో ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచారు కూడా.. కానీ ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య స్పర్ధలు రావడంతో పెళ్లయిన మూడేళ్లకే అనగా 2017 లో విడాకులు తీసుకొని వేరుపడ్డారు. ఇక ఆ సమయంలో అమలాపాల్ ఎన్నో సమస్యలు, విమర్శలు కూడా ఎదుర్కొంది. అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

అదే సమయంలోనే జగత్ దేశాయ్ తో పరిచయం ఏర్పడింది. అమలకు అతడు అండగా నిలిచారు.. తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కుదరడం , ప్రేమగా మారడంతో 2023లో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది ఈ జంట. పైగా 2024 లో కుమారుడు జన్మించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వ్యాపారవేత్త అయిన జగత్ కి అమలాపాల్ నటి అన్న విషయం తెలియదట. వివాహమైన తర్వాతనే ఈ విషయం తెలిసిందని ఆమె ఈ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×